Begin typing your search above and press return to search.

బన్నీ-త్రివిక్రమ్.. అందరికీ నేర్పేశారు

By:  Tupaki Desk   |   19 Aug 2015 5:48 PM GMT
బన్నీ-త్రివిక్రమ్.. అందరికీ నేర్పేశారు
X
బాహుబలి, శ్రీమంతుడు అంచనాలకు మించి హిట్ అయ్యాయి. కలెక్షన్ల లో కొత్త రికార్డులను సృష్టించాయి. ఇంకా వీటి ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఈ మూవీల సక్సెస్ లో కీలక పాత్ర పబ్లిసిటీ దే అని చెప్పాలి. తన మూవీపై పూర్తి విశ్వాసం ఉండే రాజమౌళి... బాహుబలి కోసం రూట్ మార్చి ప్రచారం చేశాడు. మహేష్ కూడా అంతే. ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేసే ప్రిన్స్... శ్రీమంతుడు కోసం తెగ కష్టపడ్డాడు. అయితే... ఈ రెండు సినిమాలకు ప్రచారం చేసిన పద్ధతి చూస్తే.... ఇది ఇన్ స్పిరేషన్ అని అర్ధమవుతుంది.

రివ్యూలు, విమర్శలను పట్టించుకోకుండా... సన్నాఫ్ సత్యమూర్తి సూపర్ హిట్ అయి 50కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ మూవీ పై హైప్ తెచ్చేందుకు బన్నీ-త్రివిక్రమ్ లు విభిన్నమైన పబ్లిసిటీ చేశారు. ఒక్కో కేరక్టర్ ని ఒక్కోసారి రివీల్ చేస్తూ... ఆడియో రిలీజ్ వరకూ డిఫరెంట్ గా ట్రై చేశారు. ఈ పద్ధతిని రాజమౌళి ఫుల్లుగా ఉపయోగించుకున్నాడు. సినిమాలో ఉన్న కేరక్టర్ల ను వారానికొకటి చొప్పున రిలీజ్ చేసి... జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. అంతే కాదు రిలీజ్ తర్వాత సినిమా ప్రచారం కోసం.. సక్సెస్ మీట్స్ పేరు తో హంగామా చేశారు. నాలుగైదు ఊళ్లలో ఈ ట్రిక్ ప్లే చేసారు.

ఇది బాగానే వర్కవుట్ అయింది. దీంతో శ్రీమంతుడు కోసం మహేష్ కూడా ఇదే పని చేస్తున్నాడు. రిలీజై 2 వారాలుకూడా కాలేదు ఇప్పటికే 5సార్లు సక్సెస్ మీట్స్ పెట్టారంటే... ఏ స్థాయిలో ఈ కాన్సెప్ట్ ని ఉపయోగించుకుంటున్నారో అర్ధమవుతుంది. శ్రీమంతుడుకి ఇంకా ఇలాంటి మీట్స్ చాలానే ఉన్నాయని టాలీవుడ్ టాక్. మొత్తానికి చరిత్ర సృష్టించిన ఈ సినిమాలకు... అంత పెద్ద హిట్ అయ్యేలా చేసేందుకు ఐడియా ఇచ్చింది బన్నీ-త్రివిక్రమ్ లే అనడంలో సందేహం అక్కర్లేదు.