Begin typing your search above and press return to search.
పాకిస్తాన్ తో అల్లు అర్జున్ యుద్దం
By: Tupaki Desk | 15 April 2017 4:54 AM GMTస్టయిలిష్ స్టార్ తదుపరి ఏ సినిమాతో వస్తున్నాడు అంటే అందరూ వెంటనే ''డిజె దువ్వాడ జగ్నాథమ్'' సినిమా గురించే చెబుతారు. కాకపోతే అల్లు అర్జున్ మాత్రం ఆ తరువాత వచ్చే సినిమా కోసం కూడా కసరత్తులు చేసేస్తున్నాడు. అల్లు అరవింద్ సారథ్యంలో.. లగడపాటి శ్రీధర్ రూపొందించే ఈ సినిమా కోసం ఇప్పటికే ఒక టీమ్ ప్రీ-ప్రొడక్షన్ పనులు చేస్తోందట. పదండి అసలు ఈ పాకిస్తాన్ తో యుద్దం మ్యాటరేంటే తేల్చేద్దాం.
నిజానికి ఎంతోమంది స్టార్ హీరోలకు కథలు చెప్పి.. చివరకు బన్నీ దగ్గర తన డెబ్యూ ఫిలిం ఓకె చేయించుకున్నాడు రైటర్ వక్కంతం వంశీ. ఈ సినిమాలో ఒక ఆర్మీ మ్యాన్ గా హీరోగా కనిపిస్తాడట. అందుకే ఈ సినిమాలో పాకిస్తాన్ తో భారత్ తలపడే యుద్దం సీన్లు పెట్టారట. ''నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'' అనే టైటిల్ జస్టిఫికేషన్ కోసం సినిమా ప్రారంభంలోనే ఒక 15 నిమిషాల కార్గిల్ తరహా వార్ సన్నివేశం ఉందని తెలుస్తోంది. దానికోసం గ్రాఫిక్స్ అండ్ సెట్టింగ్స్ కోసం బాగానే ఖర్చుపెట్టాలట. ఇప్పుడు ఆ సీన్ల స్టోరీ బోర్డులను వేయించి రెడీ చేస్తున్నట్లు టాక్.
ఆల్రెడీ మొన్న సరైనోడు కేవలం ఆర్మీ రిటర్న్ అన్నట్లుగా చూపించి ఇంప్రెస్ చేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు ఏకంగా ఫుల్ టైమ్ ఆర్మీ మ్యాన్ గా కనిపించి అలరిస్తాడనమాట. మొత్తానికి ఈసారి ఇంకా పెద్ద హిట్టు కోసం టార్గెట్ చేసినట్లున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/