Begin typing your search above and press return to search.
ఎవరి ఒరిజినాలిటీ వాళ్లకి ఉంటేనే బాగుంటుంది
By: Tupaki Desk | 31 Oct 2021 5:30 AM GMTఇటీవల కాలంలో చిన్న సినిమాలను ప్రమోట్ చేయడానికి పెద్ద హీరోలు ముందుకు రావడం ఆనదించవలసిన పరిణామం. చిన్న సినిమాలకి సంబంధించిన టీజర్లను .. ట్రైలర్లను .. పెద్ద హీరోలు లాంచ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్లకి హాజరవుతూ చిన్న హీరోలను ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి పెద్ద హీరోలలో అల్లు అర్జున్ ముందు వరుసలో కనిపిస్తున్నాడు. తాజాగా ఆయన నిన్నరాత్రి జరిగిన 'పుష్పక విమానం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ వేదికపై ఆయన హీరో ఆనంద్ దేవరకొండను గురించి మాట్లాడాడు.
"ఆనంద్ దేవరకొండ కథలను ఎంచుకునే తీరు కొత్తగా ఉంటుంది. అందుకు ఆయనను అభినందిస్తున్నాను. ఈ సినిమలో 'కల్యాణం .. కమనీయం' బ్లాక్ బస్టర్ పాట. ఇప్పటికే నేను చాలా సార్లు విన్నాను. ఆనంద్ సినిమాల్లో ఇంతకుముందు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆయనకి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది .. అందువల్లనే పాటలు బాగుంటాయని చెప్పారు. నిజంగానే ఈ సినిమాలో ఆయన చేసిన రోల్ .. అందరూ ఒప్పుకునేది కాదు. స్క్రిప్ట్ పట్ల గౌరవంతో ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరించడం అభినందించవలసిన విషయం.
మంచి స్క్రిప్టులు మాత్రమే గొప్ప ఫలితాలను ఇవ్వగలవు. విజయ్ .. ఆనంద్ ఇద్దరూ కూడా నా బ్రదర్స్ వంటివారు. ప్రతి ఒక్కరికీ ఒక ఒరిజినాలిటీ ఉంటుంది. ఒకరు చేసిన పాత్రలు మరొకరు చేయలేరు .. ఒకరు చేయలేని పాత్రలు మరొకరు చేయవచ్చు. ఎప్పుడు కూడా పక్కకి చూస్తూ పటిగెత్త వద్దు .. నీ ఓన్ గిఫ్ట్ నీకు ఉంది .. ముందుకు చూసి పరిగెత్తు. అలా ఆనంద్ దేవరకొండ తనదైన ప్రత్యేకమైన స్టైల్ తో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను.
ఇక పునీత్ రాజ్ కుమార్ గారి గురించి .. నాకు పునీత్ గారు ఎప్పటి నుంచో పరిచయం. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేవారు. నేను బెంగుళూరు వెళితే వాళ్ల ఇంటికి వెళ్లేవాడిని. ఎన్నో ఫంక్షన్స్ సమయంలోను కలుసుకున్నాము. ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. అలాంటి వ్యక్తి హఠాత్తుగా వెళ్లిపోయారు. నేను ఈ న్యూస్ ఫస్టు టైమ్ వినగానే షాక్ అయ్యాను. ఆ తరువాత బాధ పెరుగుతూ వచ్చిందేగాని తగ్గలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కాసేపు మౌనం పాటిద్దాం" అంటూ మౌనం పాటించారు. ఆ తరువాత 'పుష్ప' సినిమా డిసెంబర్ 17వ తేదీన వస్తుందనే విషయాన్ని గుర్తుచేస్తూ .. 'తగ్గేదే లే' అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు.