Begin typing your search above and press return to search.
ఇది కదా పుష్ప రాజ్ కాన్ఫిడన్స్ అంటే..!
By: Tupaki Desk | 29 Oct 2022 10:30 AM GMTస్టైలిష్ స్టార్ నుంచి పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా ప్రమోట్ అయిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ విశ్వరూపం హిందీ ఆడియన్స్ ని కూడా ఊగిపోయేలా చేసింది.
పాత్ర పర్ఫెక్షన్ లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అల్లు అర్జున్ కూడా తన మొదటి సినిమా నుంచి రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఇప్పటికి సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఓ నిర్మాత కొడుకు నేనెందుకు కష్టపడాలి అన్న ఆలోచనని పక్కన పెట్టి ఒళ్లొంచి పనిచేశాడు కాబట్టే ఈరోజు ఆయన ఇంత పెద్ద స్టార్ అయ్యాడు.
అల వైకుంఠపురములో.. పుష్ప పార్ట్ 1 ఈ రెండు సినిమాల్లోనే చూస్తే అల్లు అర్జున్ పాత్రల వ్యత్యాసం.. ఆ పాత్రల్లో ఆయన అభినయం ప్రశంసనీయంగా ఉంటుంది. అందుకే ఆ సినిమాలకు అవార్డుల పంట పండింది. ఈమధ్యనే అల వైకుంఠపురములో సినిమాకు గాను మ్యూజిక్ డైర్కటర్ థమన్ కి నేషనల్ అవార్డ్ వచ్చింది.
పుష్ప సినిమాకు బన్నీకి సైమా, ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. లేటెస్ట్ గా పుష్ప పార్ట్ 1 సినిమాలో తన నటనకు గాను సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ కూడా వచ్చింది. ఈ అవార్డ్ వేడుకల్లో బన్నీ మాట్లాడుతూ లాస్ట్ ఇయర్ కూడా ఈ అవార్డ్ తాను అందుకున్నానని.. ఈ ఏడాది వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కూడా అందుకుని హ్యాట్రిక్ పూర్తి చేస్తానని అన్నారు.
అల్లు అర్జున్ కమిట్మెంట్ ఉన్న నటుడు. అందుకే ఆయన ఎంచుకున్న పాత్రల కోసం ప్రాణం పెట్టేస్తాడు. అలా చేస్తాడు కాబట్టే సినిమాలు ఆ రేంజ్ హిట్ అవుతున్నాయి. ఎప్పుడైనా సరే సినిమా నిరాశపరచొచ్చు కానీ బన్నీ మాత్రం కాదు.
ఆ కాన్ఫిడన్స్ ఉంది కాబట్టే నెక్స్ట్ ఇయర్ కూడా అవార్డ్ నాదే అంటూ చెప్పాడు అల్లు అర్జున్. పుష్ప రాజ్ పాత్రతో బాలీవుడ్ ఆడియన్స్ లో తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ని రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సుకుమార్, అల్లు అర్జున్ మరోసారి వీరి మ్యాడ్ నెస్ ని పుష్ప సెకండ్ పార్ట్ ద్వారా ప్రేక్షకులకు చూపించాలని ఫిక్స్ అయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.