Begin typing your search above and press return to search.
భార్యతో కలిసి ఆ ధియేటర్లో బన్నీ..
By: Tupaki Desk | 5 May 2018 8:19 AM GMTనా పేరు సూర్య సినిమా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ కొత్తగా కనిపించాడని అతని నటన కోసమైనా ఓసారి సినిమా చూడొచ్చని చెప్పేవాళ్లూ ఉన్నారు. అల్లుఅర్జున్ తన సినిమా విడుదలయ్యాక కచ్చితంగా భార్యతో వెళ్లి ఆ సినిమా చూసి వస్తాడు. ఈ సారి కూడా అదే చేశాడు. అభిమానుల మధ్య కూర్చుని తన సినిమాను తానే ఎంజాయ్ చేశాడు.
అల్లు అర్జున్ తన సినిమాను ఎక్కడ పడితే అక్కడ చూడడు. అభిమానుల మధ్య చూడాలనుకుంటే కేవలం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్‌కే వస్తాడు. అది సెంటిమెంటగా పెట్టుకున్నట్టున్నాడు బన్నీ. ఇప్పటివరకు ఆ థియేటర్లో చాలా సినిమాలు చూశాడు. శుక్రవారం సాయంత్రం సతీమణి స్నేహ కుటుంబసభ్యులు తన సినిమా యూనిట్‌తో కలిసి సందడి చేశాడు. ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా థియేటర్ వద్దకు చేరుకున్నారు. వారందరికీ హాయ్ చెప్పి థియేటర్‌లోకి వెళ్లిపోయారు. అనంతరం సినిమా చూసి కుటుంబంతో వెనుతిరిగారు.
తొలిసారిగా బన్నీ దేశాన్ని ప్రేమించే జవాను పాత్రలో ఒదిగిపోయాడు. నాకు నా దేశం కావాలి ఇచ్చెయ్ అంటూ దేశభక్తిని చాటాడు. కిక్ - ఎవడు - టెంపర్ లాంటి బంపర్ హిట్ చిత్రాలకు కథలను అందించిన ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సినిమాలోని పాటలు ఫర్వాలేదనిపించాయి.