Begin typing your search above and press return to search.
బూతులు తగ్గించాను.. అన్ కండిషనల్ లవ్ కదా : అల్లు అర్జున్
By: Tupaki Desk | 27 Dec 2020 8:20 AM GMTస్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న షో ‘సామ్ జామ్’. ఇటీవలే ప్రారంభమైన ఈ షో.. సక్సెఫుల్ గా రన్ అవుతోంది. లాస్ట్ వీక్ మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చిన ఈ షో హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేశారు. ఈ మధ్యనే షూట్ చేసిన ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. న్యూఇయర్ గిఫ్ట్ గా జనవరి 1న ఈ ఎపిసోడ్ ను స్ట్రీమ్ చేయబోతున్నారు.
అల్లు అర్జున్ కుమారుడు అయాన్ సమంతకు ఫోన్ చేసి, ‘మా డాడీని ఒక ప్రశ్న అడగండి’ అనడంతో స్టార్ట్ అయిన ప్రోమో.. ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ తర్వాత.. అల్లు అర్జున్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో అడగాలని తమ ఫ్యాన్స్ కోరుతున్నారని చెప్పడంతో బిగ్గరగా నవ్వేశాడు బన్నీ. మరో ప్రశ్నలో.. తండ్రి అయిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి? అని సమంత అడగ్గా.. ‘ఇంట్లో బూతులు మాట్లాడటం తగ్గించాను’ అని చెప్పాడు బన్నీ. దీంతో.. అందరూ పగలబడి నవ్వారు.
ఇక, ఊహించని విధంగా అల్లు అరవింద్ కూడా షోకు వచ్చారు. సమంత వెల్కం చెబుతూ హగ్ చేసుకున్నారు. అయితే.. ‘లాక్ డౌన్ టైంలో మా డాడీని హగ్ చేసుకున్నది ఇద్దరే. ఒకటి నేను.. రెండు నువ్వు’ అన్నాడు స్టైలిష్ స్టార్. ఇక సమంత అల్లు అరవింద్ ను ఓ ఇంట్రస్టింగ్ క్వశ్చన్ అడిగింది. బన్నీ అంటే.. ఇప్పుడు హార్డ్ వర్కర్. మరి చిన్నప్పుడు కూడా ఇంతేనా? అని అడిగింది. దీనికి అల్లు అరవింద్ దండం పెట్టి ‘అంత సీన్ లేదు..’ అన్నట్లుగా ఫన్నీ ఎక్స్ ప్రెషన్ ఇవ్వడంతో షోలో నవ్వులు విరబూశాయి. ఫైనల్ గా ‘అన్ కండిషనల్ లవ్ ఇద్దరిదే. ఒకటి ఫ్యామిలీది.. రెండోది అభిమానులది’ అని బన్నీ చెప్పడంతో ప్రోమో ముగిస్తుంది. ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది.