Begin typing your search above and press return to search.

గమ్మునుండవోయ్ అని అన్నీ పట్టేశాడు

By:  Tupaki Desk   |   30 March 2017 12:41 PM GMT
గమ్మునుండవోయ్ అని అన్నీ పట్టేశాడు
X
ఒక పాత్ర సూపర్బ్ గా క్లిక్ కావడం అంటే.. దాని అర్ధం ప్రతీ ఒక్కరు ఆ రోల్ ను గుర్తించడమే. ముఖ్యంగా ఇందుకు కొలమానంగా అవార్డులను పరిగణించేవారు. గతంలో నంది అవార్డులు ఉండేవి.. ఫిలింఫేర్ ఫంక్షన్స్ జరిగేవి. కానీ ఇప్పుడు బోలెడన్ని అవార్డులు ఇచ్చేస్తున్నారు.

నెలకో అవార్డ్ ఫంక్షన్ చొప్పున ఏడాదంతా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఒక్కొక్కరి ప్రమాణాలు ఒక్కో రకంగా ఉండడం.. వారి ప్రాధామ్యాలు వేరుగా ఉండడంతో.. ఒక చోట ఉత్తమచిత్రంగా నిలిచిన మూవీకి.. రెండో చోట అవార్డ్ లభించని పరిస్థితి. బెస్ట్ యాక్టర్.. బెస్ట్ యాక్ట్రెస్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ ట్రెండ్ బ్రేక్ చేసేశాడు. రుద్రమదేవి చిత్రంలో స్టైలిష్ స్టార్ చేసిన గోన గన్నారెడ్డి పాత్ర మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాదు.. సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అవార్డుల వేడుకల్లో కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది.

ఉత్తమ సహాయ నటుడుగా.. రెండో ఆప్షన్ తీసుకోకుండా అనేక ఫంక్షన్స్ లో అల్లు అర్జున్ నే ఎంపిక చేసిన అవార్డ్ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఐఫా ఉత్సవంతో పాటు.. అంతకు ముందు సినీమా అవార్డ్స్.. అంతకుముందు సైమా.. వీటితో పాటు ఫిలింఫేర్ కూడా అందుకున్నాడు అల్లు అర్జున్. ఒకే పాత్రకు నాలుగు ఫంక్షన్స్ లో ఒకటే అవార్డ్ రావడం.. బహుశా ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/