Begin typing your search above and press return to search.

అంధుడి పాత్రలో అల్లు అర్జున్..?

By:  Tupaki Desk   |   21 Jun 2021 10:30 AM GMT
అంధుడి పాత్రలో అల్లు అర్జున్..?
X
అల్లు అర్జున్ - డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో ''ఐకాన్'' అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘కనుబడుట లేదు’ అనేది దీనికి ట్యాగ్ లైన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనివార్య కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ పై ఇటీవలే క్లారిటీ వచ్చేసింది. సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం బన్నీ నటిస్తున్న 'పుష్ప' మొదటి భాగం పూర్తైన తర్వాత 'ఐకాన్' సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే 'వకీల్ సాబ్' డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

అదేంటంటే.. 'ఐకాన్' సినిమాలో అల్లు అర్జున్ అంధుడి పాత్రలో కనిపించబోతున్నాడట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కే ఈ చిత్రంలో.. ‘కనుబడుట లేదు’ అనే ఉపశీర్షిక కు తగ్గట్లుగా బన్నీకి నిజంగానే కళ్ళు కనిపించవని అంటున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లని హీరో అల్లు అర్జున్. లుక్స్ - గెటప్స్ పరంగా కొత్తగా కనిపించాలని తపించే బన్నీ.. ఇప్పుడు 'పుష్ప 1' లో రగ్గుడ్ లుక్ లో లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో 'ఐకాన్' సినిమాతో ఫస్ట్ టైం ప్రయోగాత్మక రోల్ చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.