Begin typing your search above and press return to search.
చైనా స్పిన్నర్లకు బన్నీ బ్రాండ్ అంబాసిడర్
By: Tupaki Desk | 28 July 2017 6:07 AM GMTమనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు.. ఒక సినిమాలో ఎవరైనా హీరో ఒక డ్రస్సు వేసుకోవడం కాని ఒక పర్టికులర్ వస్తువు ఏదైనా వాడటం కాని చేస్తే.. చాలామంది అభిమానులు వాటికి ఫ్యాన్స్ అయిపోతారు. అదిగో ఇప్పుడు అల్లు అర్జున్ చేతిలోని ఒక వస్తువును.. హైదరాబాద్ విజయవాడ వైజాగ్ వంటి నగరాల ప్రధాన కూడళ్ళలో సిగ్నల్ పడినప్పుడు తెగ అమ్మేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ వస్తువు షాపుల్లోకి కూడా వచ్చేసింది.
అదిగో డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో 'మెరిసే మెరుపా' అంటూ సాగే పాట మొదట్లో బన్నీ చేతిలో ఉన్న ఆ స్పిన్నర్ ఉంది చూశారూ.. దీనిని ఒత్తిడి నిండి రిలీఫ్ ఇవ్వడానికి సరదాగా చేతిలో తిప్పుకునే ఒక ఫిడ్జెట్ స్పిన్నర్ అంటారని.. మనం ఎప్పుడో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈ స్పిన్నర్లను ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర 100 రూపాయలకు ఒకటి చొప్పున అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఇదే స్పిన్నర్లను కొన్ని షాపులవారైతే ఏకంగా బోర్డులు పెట్టి మరీ అమ్ముతున్నారు. ఎక్కువగా చైనా నుండి వస్తున్న ఈ ప్రొడక్ట్ కు.. బన్నీ ఫోటో తగిలించి మరీ అమ్మడం క్రేజుకు పరాకాష్ట అని చెప్పాలి.
ఇకపోతే ఈ స్పిన్పర్ వాడకం వలన ఒత్తిడి తగ్గుతుందో లేదో తెలియదు కాని.. ఇది అమ్మాయిలకు సరదాగా అల్లు అర్జున్ అభిమానులకు బాగా క్రేజీగా అనిపిస్తోంది. అయితే కార్పరేట్ కంపెనీల్లో చాలామంది ఈ స్పిన్నర్ ను తిప్పుతున్న వేళ.. అది వేళ్ల మధ్యలోనుండి ఎగిరి మిస్సయ్యి కంప్యూటర్ స్ర్కీన్ కు తగిలి.. సదరు స్ర్కీన్ మీద బీటలు పడేలా చేసిన సందర్భాలూ ఉన్నాయట. మరి అల్లువారి ఆట వస్తువుతో తస్మాత్ జాగ్రత్త!!