Begin typing your search above and press return to search.

వీడియో: అల్లు బ్రో తీన్ మార్

By:  Tupaki Desk   |   8 Sep 2019 4:38 PM GMT
వీడియో: అల్లు బ్రో తీన్ మార్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోద‌రుడు అల్లు వెంక‌టేష్ అలియాస్ అల్లు బాబి గురించి బ‌య‌ట తెలిసింది త‌క్కువే. ఆయ‌న తెర ముందు న‌టుడు కాక‌పోయినా తెర‌వెన‌క మాత్రం బిగ్ బిజినెస్ టైకూన్ అని చెబుతారు. ఇటీవ‌లే బాబీ త‌న స్నేహితురాలిని రెండో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే వెడ్డింగ్ ఫోటోలు- వీడియోలు అభిమానుల సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. ఈ వేడుక‌లో మెగా ఫ్యామిలీ స‌హా ప‌లువురు బంధు మిత్రులు సంద‌డి చేశారు.

ఆ త‌ర్వాత బాబీ సంద‌డేమీ టీటౌన్ లో పెద్దంత‌గా క‌నిపించ‌లేదు. తాజాగా ఆయ‌న తీన్ మార్ ఆడుతున్న వీడియో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది. వైట్ అండ్ వైట్ కుర్తా .. నెరిసిన గ‌డ్డం.. వెండిలా మెరుస్తున్న హెయిర్ క‌ట్.. కాంబినేష‌న్ బ్లాక్ గ్లాసెస్ లో చూస్తుంటే త‌ళా అజిత్ నే మ‌రిపించేస్తున్నాడు. ఇక స్టెప్పుల్లో ఏమైనా త‌గ్గాడా అంటే మాస్ స్టెప్పుల్లో బ‌న్నినే మ‌రిపించేస్తున్నాడు. తీన్ మార్ ఆడ‌డంలో త‌న‌కు వేరొక‌రు సాటి రార‌నే ప్రూవ్ చేస్తున్నాడు. న‌టుడిగా ఇది డెబ్యూ వీడియోలా ఉంది.

ఇంత‌కీ ఈ తీన్ మార్ ఎక్క‌డ‌? వినాయ‌క నిమ‌జ్జ‌నం చేస్తున్న‌ప్పుడేనా.. లేక ఏదైనా షూటింగ్ లో పాల్గొన్నాడా? అన్న డౌట్లు వ‌స్తున్నాయి. ఏదైతేనేం బాబీ ట్రై చేసి ఉంటే న‌టుడిగా స్టైలిష్ స్టార్ నే వెన‌క్కి నెట్టేవాడేమో! అన్న‌ట్టు పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌లో ఆరంగేట్రానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. మ‌రి అందులో నిజం ఎంతో?