Begin typing your search above and press return to search.

బన్నీ సీక్రెట్స్ షేర్ చేసుకునేది తనతోనే

By:  Tupaki Desk   |   30 May 2018 9:34 AM GMT
బన్నీ సీక్రెట్స్ షేర్ చేసుకునేది తనతోనే
X
సినిమాల్లో అయినా.. నిజజీవితంలో అయినా అన్నదమ్మల అనుబంధం గొప్పగానే ఉంటుంది. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగే అన్నదమ్ములతోనే ఎక్కువ సంగతులు.. సీక్రెట్లు షేర్ చేసుకుంటాం. తాను అందుకు మినహాయింపు ఏమీ కాదని.. తన జీవితం గురించి ఎక్కువ తెలిసిన వ్యక్తి తన తమ్ముడు శిరీష్ యేనని అంటున్నాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్.

తమ్ముడు శిరీష్ 31వ బర్త్ డేని తన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అన్న అల్లు అర్జున్‌, వదిన స్నేహ, వారి పిల్లలతో కలిసి శిరీష్ కేక్‌ కట్‌చేసి సంతోషంగా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్షణాలను సంతోషంగా షేర్ చేస్తూ అల్లు అర్జున్ తన ఫీలింగ్ ను షేర్ చేసుకున్నాడు. ‘‘జీవితంలో నా మొదటి బేబీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా కళ్ల ముందే పుట్టి ఈ బేబీ పెరిగి ఇంత పెద్దవాడయ్యాడు. నా సీక్రెట్లు - మెమొరీస్ పంచుకునేది అతనితోనే పంచుకుంటాను. హ్యాపీ బర్త్ డే మై బేబీ బ్రదర్ సిరి’’ అంటూ బన్నీ ట్వీట్‌ చేశాడు.

అల్లు హీరోలిద్దరి అనుబంధానికి నెటిజన్లు కూడా ముచ్చటపడి ప్రశంసలు కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ ఇప్పటికే తెలుగు - మళయాళంలో స్టార్ స్టేటస్ సంపాదిస్తే.. శిరీష్ అన్న బాటలో నడుస్తూ స్టార్ డమ్ సంపాదించడానికి ట్రై చేస్తున్నాడు.