Begin typing your search above and press return to search.
ఆహా 2.0 కోసం అల్లు అర్జున్ 'సినిమా పురం'
By: Tupaki Desk | 3 Nov 2021 6:42 AM GMT100 శాతం ఫ్రెష్ తెలుగు కంటెంట్ ను అందించాలనే లక్ష్యంతో డిజిటల్ రంగంలో అడుగుపెట్టింది 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్. ఎప్పటికప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు - ఒరిజినల్ వెబ్ సిరీసులు - సరికొత్త టాక్ షోలతో ప్రేక్షకులకు అసలు సిసలైన వినోదాన్ని అందిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ - జూపల్లి రామ్ సారధ్యంలో నడుస్తున్న ఈ తెలుగు ఓటీటీ సంస్థ.. రోజు రోజుకీ తమ సబ్ స్కైబర్స్ ను పెంచుకుంటూ పొతోంది. అతి తక్కువ కాలంలోనే ఇతర ఓటీటీ వేదికలకు గట్టి పోటీనిస్తోందని చెప్పవచ్చు.
సక్సెస్ ఫుల్ గా 20 నెలలు పూర్తి చేసుకున్న ఆహా.. ఇప్పుడు సరికొత్త ఫీచర్స్ తో వీక్షకులను ఆకర్షించే ప్లాన్ చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సమర్పణలో ''ఆహా 2.0'' గా అవతరించబోతోంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ యాప్ ను అప్ గ్రేడ్ చేసి సరికొత్త ఫీచర్స్ అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో 'ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0' అనే గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ త్వరలో 'సినిమాపురం' తో కలుద్దామని.. అదేంటో తరువాత చెప్తానంటూ ఓ సర్ప్రైజింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో 'సినిమా పురం' అనే గ్రామం వద్ద అల్లు అర్జున్ కార్వాన్ వచ్చి ఆగినట్లు చూపించారు. బన్నీ చెప్తున్న 'సినిమా పురం' ఏంటని అభిమానులు సోషల్ మీడియాలో డిస్కషన్ చేసుకుంటున్నారు. 'ఆహా 2.0' కోసం ఏదైనా టాక్ షో చేస్తున్నారేమో అని.. అల్లు అర్హ తో స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారేమో అని కామెంట్స్ పెడుతున్నారు.
'అల వైకుంఠపురములో' బృందం అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ - థమన్ మళ్ళీ కలవబోతున్నట్లు ఇటీవల వెల్లడి కావడంతో అది 'సినిమా పురం' కోసమే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదైతేనేం బన్నీ ఆహా వేదికగా ఫ్యాన్స్ కోసం ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశారని అర్థం అవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. ఇకపోతే 'ఆహా 2.0' కొత్త సాఫ్ట్ వేర్ తో ఉంటుందని.. చదువురాని వాళ్లు కూడా ఆపరేట్ చేయొచ్చని అల్లు అర్జున్ తెలిపారు. 'ఆహా' తెలుగువారి కొత్త అలవాటు.. ఎవ్రీ ఫ్రైడే న్యూ రిలీజ్ అంటూ త్వరలో రాబోయే కంటెంట్ వీడియోను చూపించారు.
ఇప్పుడు ఆహాను సబ్స్క్రైబ్ చేసుకున్న వీక్షకులకు ఆహా 2.0 ద్వారా ఆడియో - పిక్చర్ క్వాలిటీ పరంగా వరల్డ్ క్లాస్ ఫీచర్స్ తో కంటెంట్ ని అందిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఆహా లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' 'లక్ష్య' 'మంచిరోజులొచ్చాయి' 'డీజే టిల్లు' 'రొమాంటిక్' 'అనుభవించు రాజా' 'పుష్పక విమానం' 'గని' వంటి ఫిక్షనల్ - నాన్ ఫిక్షనల్ చిత్రాలతో పాటు ఆహా ఒరిజినల్స్ - టాక్ షో లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.