Begin typing your search above and press return to search.
వైకుంఠపురం పారితోషికంపై బన్నీ క్లారిటీ
By: Tupaki Desk | 13 Feb 2020 9:00 AM GMTఅల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ చిత్రంతో సూపర్ హిట్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఈ ఏడాదికి బన్నీ గ్రాండ్ వెల్ కంను తన సినిమాతో చెప్పాడు. బన్నీ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ ను కూడా దక్కించుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి బన్నీ పారితోషికం ఎంత అనే చర్చ చాలా రోజులుగా సాగుతుంది. అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మాణం లో భాగస్వామి అయ్యి ఉన్నాడు కనుక బన్నీ పారితోషికం పెట్టుబడి రూపంలో పెట్టి ఉండవచ్చు అంటూ కొందరు భావించారు.
తాజాగా ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ ఈ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పారితోషికం విషయంలో రాజీ పడలేదు. నాన్న నిర్మాత అయినా కూడా పారితోషికం తీసుకున్నట్లు గా చెప్పుకొచ్చాడట. బన్నీ వాసు తన పారితోషికంకు సంబంధించిన చర్చలు నిర్మాతలతో జరిపాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ మరియు రాధాకృష్ణలు నిర్మించిన విషయం తెల్సిందే. వారితో చాలా బేర సారాలు ఆడి మరీ బన్నీ వాసు బన్నీ పారితోషికంను ఫైనల్ చేశాడట.
అల్లు అరవింద్ తో బన్నీకి మంచి సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా ఆర్థిక పరమైన విషయాల్లో ఎవరి లెక్కలు వారివే అన్నట్లుగా ఉంటాయట. అల్లు అరవింద్ నుండి బన్నీ ఎప్పుడో వేరు పడ్డాడని.. ఆర్థిక పరమైన విషయాలను చాలా కాలంగా సొంతంగానే చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బన్నీ వాసు నిర్మిస్తున్న సినిమాల్లో బన్నీ షేర్ మెజార్టీ వాటా ఉంటుందని అంటున్నారు. అందుకే అల వైకుంఠపురం చిత్రంకు గాను తన మార్కెట్ రేంజ్ లోనే పారితోషికం తీసుకున్నాడు తప్ప తక్కువ చేసి ఏమీ తీసుకోలేదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు.