Begin typing your search above and press return to search.

*య్యో! బ‌న్ని ఆ చీవాట్లేంటి?

By:  Tupaki Desk   |   17 Dec 2018 5:53 PM GMT
*య్యో! బ‌న్ని ఆ చీవాట్లేంటి?
X
టైమ్ చూసి టైమింగు తో కొట్టేయ‌డం బ‌న్నికి అల‌వాటు. ఈరోజు కూడా మ‌ళ్లీ అలాంటి టైమ్ వ‌చ్చింది. అందుకు `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` వేదిక స్టైలిష్ స్టార్‌ కి క‌లిసొచ్చింది. ఎప్ప‌టి నుంచో జ‌నాల‌కు ఓ మాట చెప్పాల‌ని అనుకుంటున్నాడు బ‌న్ని. అందుకు ఇదే స‌రైన టైమ్ అని భావించాడు. అయితే ఆ మాట‌ను మ‌రీ ఇంత ఘాటుగా చెప్పేస్తాడ‌ని మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు. అరేయ్‌.. ఒరేయ్‌.. అని పిలిచే కుసంస్కారుల్ని ఓ రేంజులో ఆడేసుకున్నాడు బ‌న్ని. ఏదో యాధృచ్ఛికంగా బ‌న్ని ఇలా అనేసాడ‌ని అనుకోవ‌డానికి లేదు. అత‌డి వాల‌కం చూస్తే అలా అనిపించ‌లేదు. ఎప్ప‌టి నుంచో గుండెల్లో ర‌గులుతున్న‌ది ఇలా ఈరోజు సాయంత్రం టైమింగ్‌లీ అలా బ‌య‌టికొచ్చేసింద‌ని అంద‌రికీ అర్థ‌మైంది.

ఇంత‌కీ బ‌న్ని ఏమ‌న్నాడు? అంటే.. రేయ్.. చిరంజీవి అని పిలిచాడు ఎవ‌డో.. ఆ పిలుపేంట్రా.. చిరంజీవి గారు..! అంద‌రూ నేర్చుకోండి..(జ‌నం వైపు చూస్తే అన్నాడు).. ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు అని పిల‌వాలి.... పొలిటీషియ‌న్ అయినంత మాత్రాన మీకెవ‌రికీ హ‌క్కు ఇవ్వ‌లేదు.. పొలిటీషియ‌న్ అయినంత మాత్రాన త‌క్కువ చేసి మాట్లాడ‌కూడ‌దు.... విన‌డానికి గౌర‌వంగా ఉండాలి.. ఇప్ప‌టి కైనా నేర్చుకుందాం.. విన‌డానికి హార్డ్ గానే ఉంటుంది కానీ అది త‌ప్ప‌దు... అంటూ శ‌ర్వాను అడ్డు పెట్టుకుని జ‌నాల్ని ఓ రేంజులో ఆడేసుకున్నాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే డీగ్రేడెడ్‌ గా మాట్లాడే.. మాట విసిరేసే జ‌నాల‌కు పెద్ద రేంజులోనే క్లాస్ వేసేశాడు. ఒక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ల‌ను పిలిచేందుకు ప‌ద్ధ‌తి అవ‌స‌రం అన్న‌ది బ‌న్ని సూచ‌న‌.

ఇక‌పోతే ఈ వేదిక‌ పై బ‌న్ని ప్ర‌వ‌ర్తించిన తీరు అంతే విస్మ‌యం క‌లిగించింది. అత‌డు వేదిక‌ పై చిన్నా చిత‌కా టెక్నీషియ‌న్ల‌ను సైతం ఎంతో గౌర‌వంగా పిలిచాడు. అంద‌రినీ పేరు పేరునా ప్ర‌స్థావించి గౌర‌వం ఇచ్చాడు. ఇక శ‌ర్వాను అయితే గారు గారు అంటూ సంభోధిస్తూ అంద‌రికీ షాకిచ్చాడు. త‌న స్నేహితుడినే ఇలా ఎందుకు సంభోధిస్తున్నాడు? అనుకున్న వారికి క్లారిటీనిచ్చే ప్ర‌య‌త్నం చేసాడు. శ‌ర్వా గారు.. అని ఎందుకు పిలుస్తానంటే.. మీరంతా ఆయ‌న సినిమాలు చూసి అభిమానించి రెస్పెక్ట్ ఇచ్చారు. త‌న‌కు ఒక స్థాయిని ఇచ్చారు. అందుకే గారు అని పిలుస్తున్నాను.. ఇలాంటి వేదిక‌ల‌పై నేను గారు అనే పిల‌వాలి.. అని క్లారిటీనిచ్చాడు. పెద్ద పెద్ద స్టేచ‌ర్‌(స్థాయి)లో ఉన్న వారిని ఇలానే పిలుస్తాను. కేసీఆర్ గారు... చంద్ర‌బాబు నాయుడు గారు.. అని వాళ్ల‌ను పిల‌వాలి. పిలిచేప్పుడు గారు అని పిలుద్దాం.. క‌నీసం గౌర‌విద్దాం.. ఇప్పుడైనా నేర్చుకోండి!! అంటూ ఓ రేంజులో చెడామ‌డా క‌డిగేశాడు బ‌న్నీ.