Begin typing your search above and press return to search.

భాను శ్రీని బ్లాక్ చేయ‌డం దేనికి..అన్ బ్లాక్ చేయ‌డం ఏందుకు?

By:  Tupaki Desk   |   19 March 2023 10:32 PM GMT
భాను శ్రీని బ్లాక్ చేయ‌డం దేనికి..అన్ బ్లాక్ చేయ‌డం ఏందుకు?
X
భాను శ్రీ మోహ్రా టాలీవుడ్ కి సుప‌రిచిత‌మే. `వ‌రుడు` లో అల్లు అర్జున్ వ‌ధువుగా న‌టించిన అమ్మ‌డు ఆ సినిమా త‌ర్వాత పెద్ద‌గా క‌నిపించ‌లేదు. కొన్ని తెలుగు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ అవి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ త‌ర్వాత ఇత‌ర భాష‌ల్లో కొన్ని సినిమాలు చేసింది. అక్క‌డా అదే ప‌రిస్థితి. చివ‌రిగా `10 క్లాస్ డైరీస్` లో న‌టించింది. అదీ ఆశించిన ఫ‌లితాలు సాధించింది లేదు.

ప్ర‌స్తుతం న‌టిగా దూరంగా ఉన్నా! కంటెంట్ క్రియేట‌ర్ గా ప‌నిచేస్తుంది. ఇక బ్యూటీ సోష‌ల్ మీడియాలోనూ పెద్ద‌గా యాక్టివ్ కాదు. అకౌంట్లు ఉన్నా? పేరుకే త‌ప్ప‌! సోష‌ల్ మీడియా ప్ర‌చారంతో ఫోక‌స్ అవ్వాల‌ని చూసే న‌టి కాదు. తాజాగా ఈ బ్యూటీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షాక్ ఇచ్చినట్లే ఇచ్చి మ‌రీ ఏమ‌నుకు న్నాడో? ఏమో! మ‌ళ్లీ వెన‌క్కి త‌గ్గాడు. ఆ క‌థేంటన్న‌ది చూద్దాం. ట్విట‌ర్లో త‌న‌ని అల్లు అర్జున్ బ్లాక్ చేసాడు. దానికి సంబంధించిన విష‌యాన్ని స్ర్కీన్ షాట్ తీసి షేర్ చేసింది.

`నేను అల్లు అర్జున్ తో `వ‌రుడు` సినిమాలో న‌టించాన‌ని గుర్తుంచుకోండి. ఇప్పటికీ స‌రైన అవ‌కాశాలు రావ‌ట్లేదు. గుర్తుంచుకోండి. కానీ ఇబ్బందుల్లోనూ సరదాగా ఎలా ఉండాలో? నేర్చుకున్నాను. అందుకు త‌గ్గ‌ట్టు నాలో నేను ఎన్నో మార్పులు చేసుకున్నా. ముఖ్యంగా ఇప్పుడు అల్లు అర్జున్ నన్ను ట్విట్టర్‌లో కూడా బ్లాక్ చేసినా కూడా` అని ట్వీట్ చేసింది. ఈ ట్విట్ నెట్టింట జోరుగా వైర‌ల్ అయింది.

స‌హ న‌టిని బ‌న్నీ ఇలా బ్లాక్ చేయ‌డం ఏంటి? అని నెటి జ‌నులు ప్ర‌శ్నించారు. అమెని బ్లాక్ చేయాల్సినం అవ‌స‌రం ఏముంది? ఆమె సినిమాల‌కు దూరంగా ఉంటుంది? బ‌న్నీ త‌న బిజీలో తాను ఉంటున్నాడు? దీంతో ఆమెని బ్లాక్ చేయాల్సినంత అవ‌స‌రం ఏముంది? అంటూ ర‌క‌ర‌కాల సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి. అయితే ఆ కాసేప‌టికే బ‌న్నీ అన్ బ్లాక్ చేసాడ‌ని భాను శ్రీ మ‌ళ్లీ ప్ర‌క‌టించింది. గ్రేట్ న్యూస్. అల్లు అర్జున్ న‌న్ను అన్ బ్లాక్ చేసాడు. నా కెరీర్ లో వైఫ‌ల్యాల‌కు నేను అత‌న్ని ఎప్పుడు నిందించ‌లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నా అని ట్వీట్ చేసింది. ఈ సంద‌ర్భంగా బ‌న్నీకి కృత‌జ్ఞ‌త‌లు చెప్పింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.