Begin typing your search above and press return to search.

స్నేహ‌తో పెళ్లి....బ‌న్నీ న‌మ్మ‌లేని నిజం!

By:  Tupaki Desk   |   25 July 2018 9:03 AM GMT
స్నేహ‌తో పెళ్లి....బ‌న్నీ న‌మ్మ‌లేని నిజం!
X
టాలీవుడ్ స్టార్ హీరోలు త‌మ సినిమా షూటింగ్ ల‌తో బిజీబిజీగా గ‌డిపేస్తుంటారు. దీంతో, వారికి ఫ్యామిలీతో గ‌డిపేందుకు చాలా త‌క్కువ స‌మ‌యం దొరుకుతుంది. త‌మ‌కు దొరికిన కొద్దిపాటి విరామాన్ని భార్యాపిల్ల‌ల‌తో క‌లిసి స్పెండ్ చేసేందుకు చాలా మంది హీరోలు ఇష్ట‌ప‌డుతుంటారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా త‌నకు దొరికిన కొద్ది స‌మ‌యాన్ని భార్య స్నేహ‌తో స్పెండ్ చేస్తున్నాడు. టాలీవుడ్ లోని క్యూట్ క‌పుల్స్ లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్న ఈ ప్రేమ‌జంట‌...తాజాగా దిగిన ఫొటోలను బ‌న్నీ త‌న ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇంత అంద‌ర‌మైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా అంటూ బ‌న్నీ స‌ర‌దాగా పెట్టిన ఫొటో ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

స్నేహ‌ను అల్లు అర్జున్ ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. నాగ చైత‌న్య‌-స‌మంత‌, మ‌హేష్ -న‌మ్ర‌త‌, చ‌ర‌ణ్ -ఉపాస‌న‌, అల్లు అర్జున్-స్నేహ‌...ఇలా టాలీవుడ్ క్యూట్ క‌పుల్స్ ....త‌మ‌కు సంబంధించిన అప్ డేట్స్ ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. త‌మ పిల్ల‌ల‌కు సంబంధించిన ఫొటోల‌ను బ‌న్నీ గ‌తంలో కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. తాజాగా త‌న భార్య స్నేహ‌తో క‌లిసి బ‌న్నీ ఫొటోల‌కు పోజులిచ్చాడు. దాంతో, పాటు స్నేహ ఫొటోను త‌న ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. `ఓ మైగాడ్‌.. ఇంత అంద‌మైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా. న‌మ్మ‌లేక‌పోతున్నాను` అంటూ ఆ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఈ ఫోటో పోస్ట్ చేసిన కొద్ది సేప‌టికే రెండు లక్ష‌ల లైక్‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ క్యూట్ క‌పుల్ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.