Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్.. అల్లు అయాన్.. అల్లు అర్హా

By:  Tupaki Desk   |   25 Dec 2016 4:05 PM GMT
అల్లు అర్జున్.. అల్లు అయాన్.. అల్లు అర్హా
X
అదేంటో తెలియదు కాని.. మన స్టయిలిష్‌ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు తన పిల్లల పేర్లు కూడా ఎ.ఎ. అంటూ తన సంతకం చేసే ఇనీషియల్స్ కు మ్యాచ్ అయ్యేలాగానే పెట్టేస్తున్నాడు. ఆల్రెడీ తన కొడుక్కి అల్లు అయాన్ అని పేరు పెట్టేసి.. ఎ.ఎ అనే ఇనీషియల్ వచ్చేలా ప్లాన్ చేశాడు బన్నీ. ఇప్పుడు తనకు ఈ మధ్యనే పుట్టిన కూతురు పేరును కూడా అదే ఇనీషియల్స్ కు మ్యాచ్ చేసేశాడు.

అల్లు అర్జున్ పేరులోని Ar తీసుకుని.. స్నేహా పేరు చివర్లోని ha తీసుకుని.. అర్హా అంటూ తన కూతురుకు నామధేయం చేస్తున్నట్లు ప్రకటించేశాడు బన్నీ. పైగా అర్హా అనే పేరుకు హిందూ సాంప్రదాయంలో పరమశివుడనే అర్దం వస్తుందని.. అలాగే ఇస్లామిక్ సాంప్రదాయంలో కామ్ అండ్ సెరీన్ అంటూ మీనింగ్ వస్తుందని కూడా చెప్పాడు. మొత్తానికి కూతురు పేరు కూడా ఇనీషియల్స్ ఎ.ఎ నే వస్తాయన్నమాట.

సాధారణంగా చాలామంది పెద్ద పెద్ద బిజినెస్ ఫ్యామిలీలు.. అలాగే ఫ్యాషన్ డిజైనర్లు.. తమ బ్రాండ్ పేరు కంటిన్యూ అయ్యేలా పిల్లలకు కూడా అవే అక్షరాలతో నామధేయం చేస్తుంటారు. ఇప్పుడు బన్నీ ఈ ట్రెండ్ ను సెలబ్రిటీలకు కూడా తీసుకొచ్చేశాడన్నమాట. #AlluArha