Begin typing your search above and press return to search.
బన్నీ చెక్కు చేతిలో పెట్టి ఏమన్నాడు
By: Tupaki Desk | 21 Aug 2016 11:30 AM GMTతన చిన్న కొడుకు శిరీష్ ను హీరోగా నిలబెట్టాలని చాలా తపన పడ్డాడు అల్లు అరవింద్. శిరీష్ అన్నయ్య అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో చాలా డెస్పరేట్ గా ఉన్నాడు. అలాంటి టైంలో వాళ్లకు పరశురామ్ దొరికాడు. అతడి మీద నమ్మకం పెట్టి సినిమా చేసే అవకాశమిచ్చారు. అతనా నమ్మకం నిలబెట్టుకుని శభాష్ అనిపించుకున్నాడు. ఐతే తనకు ముందు శిరీష్ తో సినిమా చేసే ఉద్దేశం లేదని.. బన్నీతో సినిమా చేయడమే టార్గెట్ అని.. ఐతే అనుకోకుండా శిరీష్ తో ‘శ్రీరస్తు శుభమస్తు’ చేశానని చెప్పుకొచ్చాడు పరశురామ్.
‘‘నేను అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేసే రోజుల్లోనే బన్నీని హీరోగా పెట్టి నా తొలి సినిమా చేయాలనుకున్నా. ‘పరుగు’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే రోజుల్లో దిల్ రాజు గారికి నా పని తీరు నచ్చి.. కథ రెడీ చేసుకుంటే సినిమా తీద్దామన్నారు. ఆ సమయంలో బన్నీని హీరోగా అనుకుని ఓ స్క్రిప్టు రాసుకున్నా. బన్నీ సినిమాల కథలన్నీ బన్నీ వాసు వింటాడని తెలిసి అతణ్ని కలిశా. కథ నచ్చిందన్నాడు కానీ.. బన్నీ పరిధికి చిన్నదవుతుందన్నాడు. ఆ తర్వాత నేను ‘యువత’తో దర్శకుడినయ్యాను. ‘సారొచ్చారు’ తర్వాత క్రిష్ రికమండేషన్ తో బన్నీకి కథ చెప్పే అవకాశం దక్కింది. అప్పుడు కూడా బన్నీ వాసునే కథ విన్నాడు.
కథ ఓకే అయింది కానీ.. అల్లు అరవింద్ గారు పిలిచి బన్నీ ఇప్పటికే రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని.. శిరీష్ కు ఏ కథా ఓ పట్టాన నచ్చట్లేదని.. తనతో అతను సినిమా చేయాలనుకుంటున్నాడని చెప్పాడు. ఓ రోజు బన్నీ నన్ను పిలిచి చెక్కు చేతిలో పెట్టి.. ‘నీ మీద నమ్మకంతో ఉన్నాం. ఏం చేస్తావో తెలియదు’ అన్నాడు. ఆ మాటతో నాపై బాధ్యత మరింత పెరిగింది. ‘శ్రీరస్తు శుభమస్తు’ మనసు పెట్టి చేశా. విడుదల తర్వాత అరవింద్ గారు ఇంకో కథ రెడీ చేస్కో సినిమా చేద్దాం అన్నారు. ఆయన నమ్మకం నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషం కలిగింది’’ అని పరశురామ్ చెప్పాడు.