Begin typing your search above and press return to search.
డీజేలో బీహార్.. బాలీవుడ్ ఏడుపు
By: Tupaki Desk | 28 Jun 2017 7:47 AM GMTబాలీవుడ్ సినిమాల్లో దక్షిణాది వారిని వెటకారం ఆడుతూ చాలానే సన్నివేశాలుంటాయి. మదరాసీలంటూ మహా ఆడేసుకుంటారు. మన హీరోలను వెటకారం ఆడుతూ తెగ డ్రామాలు ప్లే చేస్తుంటారు. అసలు టాలీవుడ్ ను ఓ ఇండస్ట్రీగానే గుర్తించలేదు కూడా. కానీ ఇప్పుడు బాహుబలి తర్వాత ట్రెండ్ మారింది. తెలుగు సినిమాలను పట్టిపట్టి మరీ చూస్తున్నారు.
రీసెంట్ గా సరైనోడు హిందీ వెర్షన్ తో బాలీవుడ్ సర్కిల్ లో సత్తా చాటాడు అల్లు అర్జున్. ఇప్పుడు బన్నీ నటించిన డీజే-దువ్వాడ జగన్నాధం వచ్చింది. ఈ మూవీలో ఓ పాయింట్ బాలీవుడ్ జనాలకు బాగా దొరికేసింది. సినిమా ప్రారంభ సన్నివేశంలో హీరో పిల్లాడిగా ఉన్నపుడు గూండాలను కాల్చేస్తాడు. తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ లో.. నువ్వు బీహార్ నుంచా.. ఛత్తీస్ ఘడ్ నుంచా అని అడుగుతాడు పోలీస్ పాత్రధారి మురళీ శర్మ.
అంటే దీని అర్ధం.. బీహారీలు.. ఛత్తీస్ ఘడ్ లో ఉండేవాళ్లు క్రిమినల్సా అంటూ సుభాష్ కె ఝా వంటి వారు ప్రశ్నిస్తున్నారు. మన సినిమాలో ఉత్తరాది వారిని అవమానించామన్నది వారి పాయింట్. పైగా ఇలా రెండు రాష్ట్రాల ప్రజలను ఇన్సల్ట్ చేస్తే.. సెన్సార్ కళ్లు మూసుకుందా అని క్వశ్చన్ చేస్తున్నారు కూడా. మరి ఉడ్తా పంజాబ్.. గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ వంటి సినిమాల్లో చూపించిన సంగతులను.. దక్షిణాది జనాలను ఇన్సల్ట్ చేస్తూ కామెడీ పండించిన హిందీ సినిమాలను మరిచిపోయారు పాపం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/