Begin typing your search above and press return to search.
దువ్వాడ జగన్నాథంకు అక్కడ అంత క్రేజా?
By: Tupaki Desk | 7 May 2017 5:50 PM GMTఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన పెద్ద హీరోల సినిమాల హిందీ వెర్షన్లకు వచ్చిన హిట్స్ చూస్తే దిమ్మదిరిగిపోవాల్సిందే. హిట్టా ఫ్లాపా అన్నది సంబంధం లేకుండా తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లకు కోట్లల్లో వ్యూస్ ఉంటాయి. అలాగని వేరే భాషల సినిమాల్ని కూడా అలా చూసేస్తున్నారనుకుంటే పొరబాటే. తెలుగు స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఇలాంటి ఆదరణ కనిపిస్తోంది. మహేష్ బాబు.. అల్లు అర్జున్.. జూనియర్ ఎన్టీఆర్.. ప్రభాస్ లాంటి హీరోల సినిమాల్ని హిందీ ప్రేక్షకులు విరగబడి చూసేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. వీళ్ల సినిమాలకు టీవీల్లోనూ ఇదే ఆదరణ కనిపిస్తోంది.
అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లాంటి యావరేజ్ మూవీకి యూట్యూబ్ లో దగ్గర దగ్గర మూడు కోట్ల వ్యూస్ ఉన్నాయంటే షాకవ్వాల్సిందే. ఈ క్రేజ్ చూసుకునే బన్నీ కొత్త సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ హిందీ శాటిలైట్.. డిజిటల్ హక్కుల కోసం ఓ సంస్థ ఏకంగా రూ.7 కోట్లు చెల్లించినట్లు సమాచారం. బాహుబలిని మినహాయిస్తే శాటిలైట్.. డిజిటల్ హక్కులకు తెలుగులో అత్యధికంగా పలికిన ధర ఇదే కావడం విశేషం.ఇప్పటికే సౌత్ ఇండియాలో తన మార్కెట్ బాగా పెంచుకున్న బన్నీ.. ఇప్పుడు నార్త్ ఇండియాలో సైతం ఇలా తన జోరు చూపిస్తుండటం విశేషమే. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దువ్వాడ జగన్నాథం’ జూన్ 23న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/