Begin typing your search above and press return to search.
డీజే సాంగ్స్ కేరాఫ్ అదిరే ఎనర్జీ
By: Tupaki Desk | 13 Jun 2017 4:28 AM GMTడీజే ఆడియో సాంగ్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. టైటిల్ సాంగ్ విడుదలయినప్పటి నుంచి యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మొదటగా సంస్కృత పదాలతో సాగిన టైటిల్ సాంగ్ నుంచి.. ఆడియోకు అదిరే రియాక్షన్ వచ్చింది. ఇప్పుడు మొత్తం ఆడియో అంతే అదిరే ఎనర్జీతో ఉండడం.. దువ్వాడ జగన్నాధంకు మెయిన్ హైలైట్ అని చెప్పాలి.
లిరిక్స్ నుంచి.. మ్యూజిక్ వరకూ.. ప్రతీ పాట లోనూ బన్నీ స్టైల్.. హరీష్ శంకర్ మార్క్.. అంతకు మించి దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జీ కనిపిస్తాయి. మొదటగా డీజే టైటిల్ సాంగ్ తో ఆల్బం ఆరంభమవుతుంది. జొన్నవిత్తుల రాసిన లిరిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. మొదటి బాటకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చే 'అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం' సాంగ్ ఇప్పటికే ఛార్ట్ బస్టర్ అయిపోయింది. అందరికీ నచ్చేసింది కూడా. ఇక మెచ్చుకో మెచ్చుకో అంటూ సాగే మూడో పాట కూడా ఫుల్ లెంగ్త్ ఎనర్జిటిక్ గా సాగుతుంది. నకాష్ అజీజ్ పాడడం ఈ పాటకు హైలైట్ గా చెప్పాలి. 'చిరంజీవి స్టెప్పులేయించావే' అంటూ ఓ లైన్ కూడా ఇందులో వినిపిస్తుంది. ఆ లైన్ వచ్చినపుడు.. థియేటర్లో రెస్పాన్స్ ఊహించుకోవడం కష్టం.
ఇక నాలుగో పాట 'సీటీ మార్ సీటీ మార్' అంటూ సాగే పాటలో 'ఎన్టీఆర్.. ఏఎన్నార్.. మెగాస్టార్.. నిన్నే చూస్తే విజిలేస్తార్..' అంటూ రాసిన లైన్ కు థియేటర్లో రెస్పాన్స్ అదిరిపోతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఇది కూడా ఫాస్ట్ బీట్ కాగా.. చివరి పాట 'బాక్స్ బద్దలైపోయే' కూడా స్పీడ్ సాంగ్ కావడం విశేషం. ఆఖరి పాట అయితే పూర్తి స్థాయిలో డీఎస్పీ స్టైల్ లోనే సాగుతుంది. మొత్తంగా మరోసారి దేవిశ్రీ మొత్త ఆల్బం అంతటినీ అరిపించేశాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/