Begin typing your search above and press return to search.

సీడెడ్ లో డిజె గట్టిగానే పట్టాడు

By:  Tupaki Desk   |   25 May 2017 4:20 AM GMT
సీడెడ్ లో డిజె గట్టిగానే పట్టాడు
X
అల్లు అర్జున్ నటించిన డీజే- దువ్వాడ జగన్నాధం మూవీ కోసం టాలీవుడ్ అంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. కొన్ని సంవత్సరాలుగా అసలు ఫ్లాప్ అనే మాట ఎరుగని ఏకైక స్టార్ హీరో అయిన స్టైలిష్ స్టార్ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. పైగా ఈ సమ్మర్ లో జనాలు.. భారీ చిత్రంగా బాహుబలి2తో సరిపెట్టేసుకోవాల్సి వచ్చింది.

జూన్ 23న థియేటర్లలోకి రానున్న డీజే పై ఇప్పుడు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఇప్పుడు సీడెడ్ ఏరియాకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయాయి. కేవలం సీడెడ్ కోసం 12 కోట్ల రూపాయలు చెల్లించారట. ఇలా హక్కులు దక్కించుకున్నది కూడా ఎవరో కాదు.. భారీ చిత్రాల నిర్మాత ఎన్ వీ ప్రసాద్ కావడం విశేషం. ఈయన బన్నీ మూవీపై బోలెడంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.. యాక్షన్ కం ఎంటర్టెయిన్మెంట్ జోనర్.. ఇలా డీజేకు చాలానే పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

అందుకే సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం డీజేపై ఏకంగా 12 కోట్లు పెట్టేశారట. ఈ మొత్తం రికవర్ చేయడం పెద్ద కష్టం కాబోదని ట్రేడ్ జనాలు అంటున్నారు. ఇక్కడ సరైనోడు మూవీ 18 కోట్ల గ్రాస్ వసూలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సమ్మర్ సీజన్ చివర్లో దువ్వాడ జగన్నాధంగా వస్తున్న అల్లు అర్జున్.. గాట్టిగా హిట్టు కొట్టేసి తన మార్కెట్ ను పటిష్టం చేసుకోవాలని చూస్తున్నారు. మరి తక్కిన ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎలా ఉండబోతోంది త్వరలోనే మనకు తెలుస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/