Begin typing your search above and press return to search.
దువ్వాడ 'గుడిలో' అరకోటి రికార్డ్
By: Tupaki Desk | 2 Jun 2017 4:32 AM GMTఅల్లు అర్జున్ నటిస్తున్న డీజే- దువ్వాడ జగన్నాధం పాటలు అదరగొట్టేస్తున్నాయి. శరణం భజే భజే అంటూ సాగిన తొలి లిరికల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వస్తే.. రెండో పాటగా 1 మినిట్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు 'గుడిలో బడిలో మడిలో'' అంటూ సాగే ఈ పాటకు అన్ని వర్గాల నుంచి అపూర్వమైన స్పందన వస్తోంది.
జస్ట్ 3 రోజుల గ్యాప్ లోనే ఈ ప్రోమో వీడియోకు 5 మిలియన్ల యూట్యూబ్ వ్యూస్ రావటం .. ఇప్పటివరకూ ఈ లెక్క 5.5 మిలియన్లు దాటిపోయింది. ఈ రెస్పాన్స్ చూస్తేనే గుడిలో బడిలో సాంగ్ ఏ రేంజ్ హిట్ అనే సంగతి అర్ధమవుతుంది. బన్నీ వేసిన అదిరిపోయే స్టెప్స్.. పక్కనే అందాలు చిందిస్తూ బన్నీకి ధీటుగా డ్యాన్స్ చేస్తున్న పూజా హెగ్డే.. బ్యాక్ డ్రాప్ లో అబుదాబి విజువల్స్.. అన్నిటికీ మించి దేవిశ్రీ ప్రసాద్ కొట్టిన ట్యూన్.. కేకలు పెట్టించేస్తోంది. వింక్ మ్యూజిక్.. జియో మ్యూజిక్ తో పాటు.. దాదాపు అన్ని మ్యూజిక్ ఆన్ లైన్ పోర్టల్స్ లోను ఈ పాటే టాప్ లో నిలవడం విశేషం.
తమ కంపెనీ నుంచి విడుదలైన ఈ పాట ఇంత సక్సెస్ కావడంతో ఆదిత్య మ్యూజిక్ తెగ హ్యాపీగా ఉంది. 'దువ్వాడ జగన్నాధం లాంటి ప్రతిష్టాత్మక మూవీని మా కంపెనీ ద్వారా అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకూ రెండు పాటలు మాత్రమే రిలీజ్ అయినా.. అందరి దృష్టి డీజేపై పడింది. ఈ ఆల్బంలో ఆకట్టుకునే పాటలు ఉన్నాయ్' అని ఆదిత్య మ్యూజిక్ ఓనర్స్ చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/