Begin typing your search above and press return to search.
డిజే సినిమాకు 130 కోట్లా??
By: Tupaki Desk | 16 Aug 2017 5:57 AM GMTదువ్వాడ జగన్నాధం సినిమా విడుదలై కలెక్షన్లు వివాదం కూడా ముగిసింది అనుకునే సమయంలో డిజే టీమ్ వాళ్ళు చెబుతున్నా కొత్త వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. అల్లు అర్జున్ ఈ సినిమాలో పంచె కట్టి డాన్స్ చేయడం దగ్గర నుండి ఈ సినిమా ఈవెంట్లకు మెగాస్టార్ చిరంజీవి రాకపోవడం వరకు అన్నీ వివాదాలే. ఈ సినిమా విడుదలై ముందు నెగిటివ్ టాక్ వచ్చి ఆ తరువాత కలెక్షన్ వివాదం మొదలై నెమ్మదిగా సినిమాకు కాస్త బెటర్ కలక్షన్ల వచ్చేంత వరకు వివాదాలతోనే సాగింది.
ఈ సినిమా ఒక్క వారంలో 100 కోట్లు కలెక్షన్లు చేసిందినే ప్రకటనతో డిజే పై విమర్శలు తీవ్ర స్థాయికి చేరాయి. డిజే సినిమా మెగాస్టార్ చిరంజీవి సినిమా రికార్డు బ్రేక్ చేసింది అని కూడా ఒక టైమ్ లో ప్రచారం మొదలుపెట్టారు. ఇంకా అప్పటి నుండి ఈ సినిమా ఎలా ఉంది అనేది పక్కన పెట్టి కలెక్షన్లు సంగతి ఏంటో చూద్దాం అని అందరూ వాటి పై దృష్టి పెట్టారు. దానితో దిల్ రాజు ఒక వివరణ కూడా ఇవ్వవలిసి వచ్చింది. దీనికి తోడు డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన అతి మరింత వేడిని పెంచింది. ఇప్పుడు దువ్వాడ జగన్నాధం మలయాళంలో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా మొదటి వారం కలెక్షన్ 1.7 కోట్లు రావడంతో ఇప్పుడు డిజే కలెక్షన్ వరల్డ్ వైడ్ గా 130 కోట్లు చేసింది అని ప్రచారం చేస్తున్నారట.
ఇప్పుడు ఈ సినిమా పై అసలు ఏ టాక్ వచ్చినా అది వివాదం కావాలని రాసిపెట్టుందేమో.. ఈ సినిమాకు 130 కోట్లు ఏంటి అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగిపోతుంది. అయితే ఇలా వివాదం వచ్చిన ప్రతిసారి ప్రొడ్యూసర్ దిల్ రాజు వచ్చి వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంటే ఈ సారి డైరెక్టర్ హరీష్ శంకర్ కానీ దిల్ రాజు కానీ ఈ విషయం పై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.