Begin typing your search above and press return to search.

అమెరికాలో డిజె వాయించలేకపోయాడు

By:  Tupaki Desk   |   26 Jun 2017 8:24 AM GMT
అమెరికాలో డిజె వాయించలేకపోయాడు
X
పబ్బుల్లో వాయించే డిజె కాదు.. పగిలిపోయేలా వాయించే డిజె అంటూ బరిలోకి దిగాడు అల్లు అర్జున్. పైగా ఈసారి మనోడు అమెరికాలో కూడా తన సత్తా చాటాలని చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు. కాని ఇక్కడ ఎవరెంత వాయించినా కూడా.. సినిమాలో కంటెంట్ వాయిస్తేనే సినిమా ఆడుతుంది. ముఖ్యంగా డాలర్లలో టిక్కెట్లు కొనే అమెరికన్ తెలుగు ప్రేక్షకులు.. రివ్యూలు రేటింగులు చూసుకునే తాము రెవెన్యూ సమర్పించుకోవాలా లేదా అని డిసైడ్ అవుతారు. అక్కడే అల్లు అర్జున్ కు దెబ్బడిపోయింది.

అమెరికా టెరిటరీ కోసం ఏకంగా 9 కోట్లు వెచ్చించి సినిమాను కొన్నారు అక్కడి పంపిణీదారులు. కట్ చేస్తే ఇప్పుడు సినిమా ఓపెనింగ్ వీకెండ్లో 8 లక్షల 50వేల డాలర్లు వసూలు చేసింది. అంటే సినిమా మరో వీక్ లో చూసుకుంటూ 1 మిలియన్ డాలర్లు ఈజీగా వసూలు చేసింది. కాని ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే మాత్రం 2 మిలియన్ డాలర్స్ వసూలు చేయాలి. అప్పుడు డిస్ర్టిబ్యూటర్లు సేదతీరేది. అలా చూసుకుంటూ 50% ఇన్వెస్టుమెంట్ ఈజీగా పోయే ఛాన్సుంది. ఆ లెక్కన ఎన్నారై మార్కెట్లో డిజె సరిగ్గా వాయించలేకపోయాడనే చెప్పాలి.

హరీశ్ శంకర్ డైరక్షన్లో రూపొందిన డిజె సినిమాలో డైలాగులు చాలా బాగున్నా కూడా.. బన్నీ బ్రాహ్మణ క్యారక్టర్ ఆకట్టుకున్నా కూడా.. పూజా హెగ్డే గ్లామర్ అదిరిపోయినా కూడా.. ఎందుకో స్టోరీలోని లోపాలు.. అలాగే డిజె క్రింద మనోడు రూపాంతరం చెందే తీరు కిక్కివ్వట్లేదు. దానికితోడు రేసుగుర్రం హ్యాంగోవర్లో మనోడు క్రియేట్ చేయిస్తున్న కామెడీ క్లయమ్యాక్సులు అస్సలు కిక్కివ్వట్లేదు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/