Begin typing your search above and press return to search.
బన్నీ 'డేంజరస్ జాన్ బాజ్'కు రెక్కలొచ్చాయ్
By: Tupaki Desk | 3 Nov 2017 4:17 AM GMTఇప్పుడు హిందీ వాళ్లకు హాటు కేకుల్లా కనిపించేవి తెలుగు సినిమాలే. అయితే ఎవరన్నాహీరోలకు రీమేక్ రైట్స్ అమ్ముకుంటాం.. లేదంటే ఎవరన్నా పెద్ద ఛానల్ వారికి డబ్బింగ్ చేసి ఇచ్చేస్తాం.. మరీ లేదంటే బాహుబలి టైపులో హిందీలో రిలీజ్ చేస్తాం. ఇది అక్కడ పరిస్థితి. ఇప్పుడు మరి 'డిజె' దగ్గరకు వచ్చేద్దాం.
గతంలో డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమా హిందీ హక్కులను మొత్తంగా 8 కోట్లకు అమ్మేశారు. అయితే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేస్తారా అని అక్కడి జనాలు కూడా ఆత్రంగానే ఎదురుచూస్తున్నారు. అందుకే యుట్యూబ్ లో ఈ సినిమా పేరుతో ఏ ఫేక్ లింక్ పెట్టినా కూడా విపరీతమైన హిట్లు వచ్చేస్తున్నాయి. పైగా మొన్న బుల్లితెరపై వచ్చిన తెలుగు వర్షన్ కు ఏకంగా బాహుబలి తరువాతి స్థానాల్లో టిఆర్పీలు కూడా వచ్చేశాయి. అందుకే ఇప్పుడు ఈ సినిమాను హిందీలో ఈ శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు.
డిజె అనే పేరు తాలూకు ఎఫెక్ట్ పోకుండా.. ఇప్పుడు ఈ సినిమాను 'డేంజరస్ జాన్ బాజ్' అంటూ అక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. పైగా పూజా హెగ్డే కూడా అక్కడోళ్లకు కాస్త తెలిసిన మొహమే కాబట్టి.. మాస్ సెంటర్లలో ఈ సినిమా కుమ్మేస్తుందని వారి అంచనా. చూద్దాం ఏమవుతుందో.