Begin typing your search above and press return to search.
`డీజే` స్టోరీపై ఓ క్లారిటీ వచ్చేసిందబ్బా!
By: Tupaki Desk | 3 Jun 2017 6:49 AM GMTసినిమా సెట్స్ పై ఉన్నప్పుడే స్టోరీ లీక్ కావడమనేది ఇప్పుడు సర్వ సాధారణమైన విషయం. ప్రారంభం రోజునే మా చిత్రం అలా ఉండబోతోందని కొద్దిమంది చెబుతుంటారు. దాన్నిబట్టే కథపై ఓ అంచనాకి వచ్చేస్తుంటాం. ఆ తర్వాత అప్పుడింత ఇప్పుడింత చొప్పున కథ లీక్ అవుతూ ఉంటుంది. మొత్తంగా సినిమా విడుదలయ్యేసరికి అదెలా ఉంటుందన్నదానిపై ఓ స్పష్టత వచ్చేస్తుంటుంది. అయితే కొద్దిమంది మాత్రం ఆ విషయంలో చాలా స్ట్రిట్టుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయం బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకొంటుంటారు. ఆఖరికి హీరోల గెటప్పులు కూడా. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న `డీజే` కథ విషయంలోనూ దర్శకనిర్మాతలు చాలా జాగ్రత్తలే తీసుకొన్నారు. కేవలం అల్లు అర్జున్ ఓ బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తాడన్న విషయం, ఆయన గెటప్పు తప్ప మరేదీ బయటికి వెల్లడించలేదు.
సినిమా మరో 20 రోజుల్లోనే బయటికి రాబోతున్నా కథ లీక్ కాకపోవడమనేది విశేషమనే చెప్పాలి. అయితే తాజాగా ఆ సినిమా చుట్టూ ముసురుకొన్న ఓ వివాదం పుణ్యమాని కథ చూచాయగా బయటికొచ్చింది. దర్శకుడే కథ ఇది, కథానాయకుడు ఇలా ఉండబోతున్నాడని వెల్లడించాడు. ఇటీవలే డీజేలోని బడిలో గుడిలో పాట విడుదలైన విషయం తెలిసిందే. ఆ పాట అభ్యంతరకరంగా ఉందంటూ బ్రాహ్మణ సంఘాలు ఆరోపించాయి. ఆ వివాదాన్ని సద్దుమణించేందుకు దర్శకుడు హరీష్ శంకర్ రంగంలోకి దిగారు. నేనూ బ్రాహ్మణ యువకుడినే అని, కథ కూడా బ్రాహ్మణుడి గురించే ఉంటుందని చెప్పుకొచ్చాడు .శాపాదపీ, శరాదపీ అనే అంశం ఆధారంగా.. బ్రాహ్మణుడు శాపంతో కానీ, శరంతో కానీ యుద్ధం చేయగలడనే విషయాన్నే ఈ చిత్రం ద్వారా చెబుతున్నానని వెల్లడించాడు హరీష్ శంకర్. అంటే కథానాయకుడు అటు శపిస్తూ, శాపాలకి లొంగని విషయాల్ని శరం (బాణం)తో చక్కబెడుతూ ఉంటాడేమో అని ఫిల్మ్‌నగర్ లో జనాలు మాట్లాడుకొంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/