Begin typing your search above and press return to search.
డీజే టార్గెట్.. సరైనోడు
By: Tupaki Desk | 17 Jun 2017 9:28 AM GMTసినిమా సినిమాకూ రేంజి పెంచేసుకుంటున్నాడు అల్లు అర్జున్. పోయినేడాది ‘సరైనోడు’తో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా టాలీవుడ్ టాప్-5 హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. తన తర్వాతి సినిమా ‘దువ్వాడ జగన్నాథం’తో నాన్-బాహుబలి హైయెస్ట్ గ్రాసర్ రికార్డు మీద బన్నీ కన్నేస్తాడని.. రూ.100 కోట్ల షేర్ మార్కును దాటి ‘ఖైదీ నెంబర్ 150’ రికార్డుపై దృష్టిసారిస్తాడని అనుకున్నారు. కానీ ‘డీజే’ ఆ స్థాయికి చేరుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతానికి ‘డీజే’ టార్గెట్ బన్నీ లాస్ట్ మూవీ ‘సరైనోడు’ను దాటడమే అంటున్నారు. ఈ సినిమా రిలీజవుతున్న టైమింగ్.. దీని మీద ఉన్న బజ్ ను బట్టి చూస్తే ‘సరైనోడు’ను దాటడం కూడా కొంచెం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘సరైనోడు’కు కొంచెం డివైడ్ టాక్ వచ్చినా తట్టుకుని భారీ వసూళ్లు సాధించిందంటే.. సమ్మర్లో రావడం అందుకు ఓ ముఖ్య కారణం. ఐతే ‘డీజే’ వేసవి సెలవులు ముగిసి.. స్కూళ్లు.. కాలేజీలు మొదలయ్యాక రిలీజవుతోంది. దీనికి తోడు ‘డీజే’ ప్రోమోస్ అవీ చూస్తే ఇది రొటీన్ మాస్ మసాలా సినిమాలా కనిపిస్తోంది. గత కొన్నేళ్లలో ప్రేక్షకులు కొత్తదనానికి పట్టం కడుతున్నారు. ‘సరైనోడు’ లాంటి సినిమాలు కూడా ఆడుతున్నప్పటికీ అన్నిసార్లూ అలాంటి మ్యాజిక్కులు జరిగిపోవు. కాబట్టి కంటెంట్ తో ఎంత సర్ప్రైజ్ చేస్తారన్నది ముఖ్యం. మరీ రొటీన్ కమర్షియల్ ఫార్ములాలతో నెట్టుకొచ్చేయడమైతే కష్టం. మరోవైపు ‘డీజే’ ప్రమోషన్ కూడా మరీ గట్టిగా ఏమీ చేయట్లేదు. బజ్ అనుకున్న స్థాయిలో రావట్లేదన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరీ పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టేసుకుంటే కష్టమని.. ముందు ‘సరైనోడు’ను దాటేస్తే ఊపిరి పీల్చుకోవచ్చని.. తర్వాత మిగతా రికార్డుల గురించి ఆలోచించొచ్చని ‘డీజే’ టీం భావిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/