Begin typing your search above and press return to search.
బన్నీ.. ఎంత ఎదిగిపోయావయ్యా!
By: Tupaki Desk | 1 March 2017 6:44 AM GMT24 గంటల్లోపే 20 లక్షలు.. మూడు రోజుల్లో 50 లక్షలు.. 107 గంటల్లో 60 లక్షలు.. ఇదీ ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ కు యూట్యూబ్ లో వచ్చిన రెస్పాన్స్. మొదట్లో జోరు చూసి సినిమా మీద ఉన్న హైప్ వల్ల ఆమాత్రం ఊపు మామూలేలే అనుకున్నారు. కానీ తర్వాత కూడా ఈ టీజర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుండటం విశేషం. పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ టీజర్ ఈ మధ్యే యూట్యూబ్ లో మోత మోగించగా.. ఇప్పుడు ‘డీజే’ దానికి దీటుగా దూసుకెళ్తోంది. దీన్ని బట్టే అల్లు అర్జున్ సినిమా సినిమాకు ఎలా పెరిగిపోతోందో.. ప్రస్తుతం అతడి స్థాయి ఏంటో అర్థమవుతుంది.
‘బాహుబలి’తో పోల్చి చూడటం వల్ల మిగతా సినిమాల సత్తా తక్కువగా కనిపించినట్లు.. ‘కాటమరాయుడు’తో పోల్చడం వల్ల ‘డీజే’ స్టామినా ఏంటో జనాలకు తెలియట్లేదు. గత కొన్నేళ్లలో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయిన బన్నీ.. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ లాంటి తన లీగ్ స్టార్లను కూడా దాటేసి పవన్ కళ్యాణ్.. మహేష్ బాబుల లీగ్ లోకి వచ్చేశాడని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. కేరళ.. కర్ణాటకల్లోనూ భారీగా ఫాలోయింగ్ సంపాదించుకోవడంతో బన్నీకి సోషల్ మీడియాలో ఆదరణ అనూహ్యంగా ఉంటోంది. ‘డీజే’ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ అందుకు నిదర్శనం. బన్నీ టీజర్ ఐదో రోజుకే 60 లక్షల వ్యూస్ తెచ్చుకోవడం అన్నది అనూహ్యమైన విషయం. చూస్తుంటే ఈ టీజర్ ‘కాటమరాయుడు’కు దగ్గరగా వెళ్లేలా కనిపిస్తోంది. ‘ఖైదీ నెంబర్ 150’ వ్యూస్ ను కూడా దాటేసేలా ఉంది. అదే జరిగితే బన్నీకది మామూలు అచీవ్మెంట్ కాదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/