Begin typing your search above and press return to search.

డీజే టీజర్.. డిస్లయిక్స్ గోల ఏంటి రాజా?

By:  Tupaki Desk   |   24 Feb 2017 8:50 AM GMT
డీజే టీజర్.. డిస్లయిక్స్ గోల ఏంటి రాజా?
X
అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే టీజర్ వచ్చేసింది. అంచనాలకు తగ్గట్లుగానే పక్కా బ్రాహ్మిన్ గెటప్ లో కుమ్మేశాడు అల్లు అర్జున్. మరోవైపు హరీష్ శంకర్ కి టీజర్ కట్ చేయడంలో ఓ ట్రేడ్ మార్క్ స్టైల్ ఉంది. ఒకే ఒక్క డైలాగ్ తో టీజర్ ను ఇవ్వడం.. అభిమానులని మెప్పించడం హరీష్ శంకర్ స్టైల్. అయితే అనూహ్యంగా ఈ టీజర్ కు రికార్డు స్థాయిలో డిస్లయిక్స్ రావడం ఇప్పుడు టాక్‌ ఆఫ్ ది టౌన్ అయిపోతోంది.

'ఇలా ఇలా ముద్దులు పెట్టేసి.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని' అంటూ బన్నీ పేల్చిన ఒకే ఒక పంచ్ మినహా.. మరో మాట వినిపించే ఛాన్స్ లేదు. అసలు హరీశ్‌ శంకర్ స్టయిల్ అదే. అతని గత సినిమాల టీజర్లను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ కు.. 'నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది' అంటూ పవన్ తో పలికించిన ఒకే ఒక్క డైలాగ్ తోనే సగం హిట్ కొట్టేశాడు హరీశ్ శంకర్. ఆ తర్వాత ఎన్టీఆర్ తో తీసిన రామయ్యా వస్తావయ్యా టీజర్ లో 'బుడ్డోడు' డైలాగ్ తు ఎట్రాక్ట్ చేశాడు. కాకపోతే ఇప్పుడు డిజె విషయంలో ఆ సింగిల్ డైలాగ్ ఎలా వర్కవుట్ అవుతోందో తెలియదు కాని.. ఈ ఆర్టికల్ రాసే సమయానికి డిజె టీజర్ కు 37000 లైక్స్ వస్తే.. 25000 డిస్లయిక్స్ వచ్చాయి. మొత్తంగా వచ్చిన లక్ష వ్యూస్ లో జనాల మైండ్ సెట్ అలా ఉందనమాట.

అయితే ఈ డిజ్ లైక్స్ అన్నీ యాంటీ ఫ్యాన్స్ పనికట్టుకొని చేస్తున్నవని.. అందులో కొందరు బన్నీ చేసిన పాత్ర ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాబట్టి కొందరు నచ్చక డిజ్ లైక్ చేస్తుంటే.. కొందరు మాత్రం చెప్పను బ్రదర్ అంటూ డిజ్ లైక్ ను కొట్టేస్తున్నారు బ్రదర్ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/