Begin typing your search above and press return to search.

విలన్ కేరక్టర్లో దేశముదురు!?

By:  Tupaki Desk   |   3 Jun 2016 5:07 AM GMT
విలన్ కేరక్టర్లో దేశముదురు!?
X
ప్రతీ సినిమాకి గెటప్ లోను - బాడీలోను - బాడీ లాంగ్వేజ్ లోను డిఫరెన్స్ చూపించడం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పెషాలిటీ. రకరకాల కేరక్టర్లతో ఆకట్టుకుంటూ ప్రతీ సినిమాకీ అప్ డేట్ అయిపోతుంటాడు. తన పాత్రలతో చాలా వేరియేషన్స్ చూపించిన బన్నీ.. ఓసారి నెగిటివ్ షేడ్ ను కూడా ట్రయల్ చూపించాడు.

ఆర్య 2 సినిమాలో బన్నీ నెగిటివ్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే చూశాం. కాకపోతే అది విలన్ షేడ్స్ ఉండే హీరో పాత్ర. అలాంటిది పూర్తి స్థాయి విలన్ గా బన్నీ నటిస్తే ఎలా ఉంటుంది? దీనికి త్వరలో ఆన్సర్ దొరకబోతోందని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. సరైనోడుతో బ్లాక్ బస్టర్ కొట్టేసిన అల్లు అర్జున్.. తన నెక్ట్స్ ప్రాజెక్టుగా లింగుస్వామితో బైలింగ్యువల్ చేస్తాడని అంటున్నారు. ఇంకా అనౌన్స్ చేయకపోయినా.. ఇప్పటికైతే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యేందుకు ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.

లింగుస్వామి దర్శకత్వంలో చేయనున్న సినిమాలో.. బన్నీ డ్యుయల్ రోల్ చేయనున్నాడని టాక్. ఇందులో ఒకటి హీరో పాత్ర అయితే.. రెండోది విలన్ రోల్ కావడమే.. ఈ మూవీ స్పెషాలిటీగా తెలుస్తోంది. ఇప్పటివరకూ బన్నీని హీరో పాత్రల్లోనే చూసిన జనాలకు.. ఇప్పుడు విలన్ యాంగిల్ ని కూడా చూపించే ప్రయత్నాలు మొదలయ్యాయన్న మాట. తనకు విలన్ రోల్ పై మక్కువను సరైనోడు విషయంలోనే చెప్పాడు అల్లు అర్జున్. సరైనోడు చిత్రాన్ని వేరే భాషలో తీస్తే తనే విలన్ రోల్ చేస్తానని బన్నీ అన్న మాట గుర్తుందిగా!