Begin typing your search above and press return to search.
రాయలసీమ రుచులు ఆస్వాదించిన బన్నీ!
By: Tupaki Desk | 9 July 2023 11:24 AMఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉంటే సెట్స్ లో షూటింగ్ లో బిజీగా ఉంటాడు. లేదంటే కుటుంబంతోనే సమయాన్ని గడుపుతాడు. పెళ్లైన తర్వాత స్నేహితులు..షికార్లు అన్నింటిని తగ్గించేసారు. చాలా రేర్ గానే స్నేహితుల్ని కలవడం జరుగుతుంది. అందులోనూ బాగా క్లోజ్ అయిన వాళ్లతో తప్ప! అందరితోనూ ఇప్పుడంతా యాక్టివ్ గామూవ్ అవ్వడం లేదు. తాజాగా బన్నీ స్నేహితులతో బెంగుళూరు కి కారులో జర్నీ చేసిన విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంత మంది స్నేహితులతో కలిసి బన్నీ బెంగుళూరు ట్రిప్ వెళ్లినట్లు తెలుస్తోంది.
మరి ఆ స్నేహితులు ఎవరెవరు? అన్నది తెలియదు గానీ...ఆన్ ది వేలో జర్నీ మాత్రం బాగా ఆస్వాదించి నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బన్నీ అండ్ ప్రెండ్స్ రాయలసీమ రుచులు కడుపునిండా ఆరగిం చారు. రాయలసీమ రుచులతో ఓ పార్టీ నేత విందు ఇచ్చారు.. బన్నీ వెళ్లే మార్గంలో గార్లదిన్నె మండలం కనుంపల్లి వద్ద ఉన్న ఓ రాజకీయ పార్టీకి చెందిన కేశవరెడ్డి ఫామ్ హౌస్ కు విచ్చేసారు. ఈ సందర్భంగా బన్నీకి కేశవరెడ్డి ఆయన కుమారుడు రాహుల్ రెడ్డి స్వాగతం పలికారు.
రాయలసీమ రుచులతో విందు భోజనం ఏర్పాటు చేసారు. రకరకాల నాన్ వెజ్ వంటకాలు వండి వడ్డించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా రాయలసీమ స్పెషల్ రాగి సంగటి...చికెన్..మటన్ కర్రీలతో రుచి చూపించారుట. ఇక అల్లు అర్జున్ వచ్చాడనే విషయం తెలియగానే ఫామ్ హౌస్ కు ప్రేక్షకాభిమానులు పోటెత్తారు. అభిమానులతో ఫామ్ హౌస్ కిటకిటలాడింది. ఫ్యాన్స్ కు బన్నీ అభివాదం చేశారు.
బన్నీతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. వాళ్లలో కొంత మందికి సెల్పీలు ఇచ్చారు. ఆ తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని అల్లు అర్జున్ బెంగళూరుకు బయల్దేరారు. బన్నీ వ్యక్తిత్వం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనకి ఆకలేస్తే స్టార్ హోటల్ లోనే భోజనం చేయాలి..బ్రేక్ ఫాస్ట్ చేయాలి అన్న రూల్ అంటూ ఏమీ లేదు. పూరి గుడిసే అయినా అతను స్టార్ హోటల్ గానే భావిస్తారు.