Begin typing your search above and press return to search.

శ్రీజ బేబీ షవర్ లో బన్నీ ఫీల్ మై లవ్!

By:  Tupaki Desk   |   19 Nov 2018 6:25 AM GMT
శ్రీజ బేబీ షవర్ లో బన్నీ ఫీల్ మై లవ్!
X
టాలీవుడ్ లో ఉన్న మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ జంటల్లో అల్లు అర్జున్ - స్నేహల జంట ఒకటి. సోషల్ మీడియాలో జనాలు ఈ జంటను విడవకుండా ఫాలో అవుతూ ఉంటారు. అప్పుడప్పుడూ బన్నీ- స్నేహ తమకు.. పిల్లలకు సంబంధించిన ఫోటోలు.. వీడియోలు అభిమానులకోసం షేర్ చేస్తూ ఉంటారు. అవి ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్నిస్తాయి. ఈసారి బన్నీ - స్నేహ జోడీకి సంబంధించిన వీడియోను అల్లు శిరీష్ షేర్ చేయడం విశేషం.

ఈమధ్యే చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కు సీమంతం వేడుక జరిగింది. ఇందులో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొన్నారు. ఈ సెలెబ్రేషన్ లో అల్లు అర్జున్ సూపర్ హిట్ ఫిలిం 'ఆర్య' నుండి చార్ట్ బస్టర్ సాంగ్ ఫీల్ మై లవ్ ను మ్యూజిక్ ట్రూప్ వారు పాడుతుండగా బన్నీ- స్నేహ ఇద్దరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. బన్నీ చైర్ లో కూర్చుని నవ్వుతుంటే.. స్నేహ వెనక నిలుచుని బన్నీ భుజాలపై చేతులేసింది. ఇక వీడియో తీస్తున్నపుడు మాత్రం కాస్త సిగ్గుపడింది. ఈ వీడియోను షేర్ చేసిన శిరీష్ "ఫీల్ మై లవ్! నా ఫేవరెట్." అంటూ ట్వీట్ చేశాడు. ఇక చెప్పేదేముంది.. వీడియోకి లైకులే లైకులు.. షేర్లే షేర్లు.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తన నెక్స్ట్ ఫిలిం పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్రివిక్రమ్ తోనే ఉంటుందని.. స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత అనౌన్స్ మెంట్ ఉంటుందని టాక్. బన్నీని అడిగితే మాత్రం సింపుల్ గా 'తెలీదు బ్రదర్' అంటున్నాడు!

వీడియో కోసం క్లిక్ చేయండి