Begin typing your search above and press return to search.
భోజనం క్యారేజీతో క్యూలో నిలబడ్డారు
By: Tupaki Desk | 10 April 2015 3:55 AM GMTఅప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, నటసింహా బాలయ్య ఈ ఇద్దరి సినిమాలు రిలీజవుతున్నాయంటే అభిమానుల్లో ఉత్సాహం పరవళ్లు తొక్కేది. తమ అభిమాన హీరో సినిమా రిలీజవుతోందంటే పొద్దున్నే చద్దన్నం క్యారేజీ సైకిల్‌కి బిగించి పట్నం వెళ్లిపోయేవారు. థియేటర్ క్యూలో టిక్కెట్ దొరికేవరకూ నానా హంగామా చేసేసేవారు. చివరికి బ్లాక్‌లో కొనుక్కుని అయినా సినిమా చూశాకే తిరిగొచ్చేవారు. అంతటి క్రేజు ఉండేది. ఒకవేళ క్యూలోనే గంటలకొద్దీ నిలవాల్సొస్తే చంకన వేసుకున్న చద్దన్నం క్యారేజీని అక్కడే తిని షో చూసిన సందర్భాలెన్నో. తాజాగా ఆలాంటి పరిస్థితే ఇప్పుడు బన్ని అభిమానులకు వచ్చింది. బన్ని హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి ఈరోజు రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బెనిఫిట్ షో వేకువఝామునే 5 గంటలకు మొదలైంది. అయితే ఆ టైమ్‌కే క్యారేజీ ఒకటి రెడీ చేసుకుని భుజాన తగిలించుకుని థియేటర్ల ముందు వాలిపోయారు కొందరు అభిమానులు. షో అయిపోయాక అట్నుంచి అటే ఆఫీసుకి వెళ్లిపోవాలనేది సదరు వీరాభిమానుల ఆలోచన. ప్లాన్ బావుంది. సినిమా చూసేయొచ్చు. ఆఫీస్ కవర్ చేసేయొచ్చు. అయితే ఇదంతా బన్నీకి ఎలాంటి అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతోంది.