Begin typing your search above and press return to search.

అవును.. బన్నీ ఫస్ట్ మూవీ ఆగిపోయింది

By:  Tupaki Desk   |   17 April 2016 6:28 AM GMT
అవును.. బన్నీ ఫస్ట్ మూవీ ఆగిపోయింది
X
మేనమామ మెగాస్టార్. తండ్రి స్టార్ ప్రొడ్యూసర్. ఆ మాటకు వస్తే.. బన్నీ ఫ్యామిలీ మొత్తం సినిమా రంగంతో క్లోజ్ రిలేషన్ ఉన్నవారే. అలాంటి ఫ్యామిలీ నుంచి ఒక కుర్రాడు సినిమాల్లోకి రావాలంటే ఎంత గ్రాండ్ ప్లాన్స్ ఉంటాయో అని అనుకోవటం కామన్. కానీ.. బన్నీ కెరీర్ గురించి అతగాడు చెప్పిన మాటలు వింటే షాక్ తినాల్సిందే.

అతని చుట్టూ అంతమంది ఉన్నా.. అతడితో అనుకున్న ఫస్ట్ మూవీ ఆగిపోయిందన్నమాటను అల్లు అర్జున్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫస్ట్ మూవీ గురించి బన్నీ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అల్లు అర్జున్ హీరోగా గంగోత్రితో ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. కానీ.. దానికి ముందే మరో సినిమాకు కమిట్ కావటం.. అది కాస్త ఆగిపోవటం లాంటి వాస్తవాలు బన్నీ నోటి వెంట వింటే..

‘‘యానిమేటర్ గా కెనడాకి వెళ్లాలని డిసైడ్ అయ్యా. ఆ లోపు ఒక సినిమా సరదాగా చేస్తే అలా గుర్తుండిపోతుంది కదా అనిపించింది. తెలిసిన వాళ్ల ద్వారా ఆ ఛాన్స్ వచ్చింది. ఓ మూడు నెలలు ఆ సినిమాకు చేసి వెళ్లిపోతే సరిపోతుంది కదా అనిపించింది. కానీ.. వేర్వేరు కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఫస్ట్ మూవీనే అలా కావటం బాగోలేదనిపించింది. అప్పటి నుంచే సినిమాల గురించి సీరియస్ గా ఆలోచించటం మొదలు పెట్టా. సినిమాల గురించి అస్సలు పట్టని నాకు.. ఆ అనుభవం ఒక సినిమా చేయాలన్న కోరిక బలంగా అనిపించేలా చేసింది. అందుకే నాన్నతో ఒక సినిమా చేయాలని స్పష్టంగా చెప్పా. దాని ఫలితమే పద్దెనిమిదేళ్ల వయసులో చేసిన గంగోత్రి సినిమా’’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు అల్లు అర్జున్.