Begin typing your search above and press return to search.

స్టైలిష్ స్టార్ కి విషెస్ వెల్లువ

By:  Tupaki Desk   |   8 April 2019 6:29 AM GMT
స్టైలిష్ స్టార్ కి విషెస్ వెల్లువ
X
ఇవాళ తన పుట్టినరోజున బన్నీ ఎక్కడ ఎలా సెలెబ్రేట్ చేసుకోబోతున్నాడో ఇంకా వివరాలు రాలేదు కాని సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు అభిమానులు. ఇది సహజంగా జరిగేదే అయినా నా పేరు సూర్య తర్వాత కొత్త సినిమా చేసి ఏడాది దాటిన తరుణంలో ఫ్యాన్స్ మూవీ అప్ డేట్స్ నే కానుకగా స్వీకరిస్తున్నారు.

ఇక వీళ్ళతో పాటు సెలెబ్రిటీలు కూడా బన్నీతో తమ స్వీట్ మెమొరిస్ ని షేర్ చేసుకుంటూ అతను తమకెంత స్పెషలో చిన్న మెసేజ్ లో వివరిస్తూ గ్రాండ్ గా విష్ చేస్తూ వైరల్ ట్రెండ్ లో తామూ భాగామవుతున్నారు. ఇందులో హీరో హీరొయిన్లు దర్శక నిర్మాతలు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ బన్నీతో గతంలో తాము తీసిన పిక్స్ ని పెడుతూ అలా ఫ్లాష్ బ్యాక్ లోకి లాక్కు వెళ్తున్నారు

మంచు లక్ష్మి-నిఖిల్-హరీష్ శంకర్-శిరీష్-రష్మిక మందన్న-రకుల్ ప్రీత్ సింగ్-పూజా హెగ్డే- తరణ్ ఆదర్శ్-సుధీర్ వర్మ- సాయి ధరం తేజ్- అనుపమ పరమేశ్వరన్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దగా ఉంది. వీళ్ళందరూ బన్నీతో తమ బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేసుకోవడమే కాక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

త్వరలో తనపక్కన జోడిగా చేయబోతున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉందని చెప్పిన రష్మిక అది ఏ సినిమానో మాత్రం పేర్కొనలేదు. మొత్తానికి బన్నీ ఇలా అభినందల వెల్లువలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు . అభిమానులు మాత్రం తమ హీరో త్రివిక్రమ్-సుకుమార్-వేణు శ్రీరామ్ లు సినిమాలు వరసగా కమిట్ అవ్వడం పట్ల యమా ఖుషిగా ఉన్నారు