Begin typing your search above and press return to search.

నా పేరు సూర్య.. అదొక్కటే టైటిల్ కాదు

By:  Tupaki Desk   |   26 Dec 2017 5:42 AM GMT
నా పేరు సూర్య.. అదొక్కటే టైటిల్ కాదు
X
ఈ మధ్యన సినిమా పేర్లన్నీ షార్ట్ అండ్ స్వీట్ అన్నట్లే ఉంటున్నాయి. ఎక్కువ మంది సీనియర్ హీరోలు.. సింగిల్ వర్డ్ ఉన్న పేర్లనే ఎంచుకుంటున్నారు. మహేష్‌ ఒక ప్రక్కన స్పైడర్ అంటే.. పవన్ ఇప్పుడు అజ్ఞాతవాసి అన్నాడు. అలాగే రామ్ చరణ్‌ రంగస్థలం అంటుంటే.. సావిత్రి సినిమా మహానటి అంటున్నారు. కాని రానున్న రోజుల్లో ఈ టైటిల్స్ మాత్రం కాస్త సాగనున్నాయ్.

ఆల్రెడీ మహేష్‌ బాబు సినిమా పేరు భరత్ అను నేను అంటూ మూడు పదాల లైన్ ను అనుకుంటుంటే.. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం కూడా అదే తరహాలో ఒక టైటిల్ వచ్చింది. అయితే ఇన్నాళ్ళూ ఆ సినిమా పేరు ''నా పేరు సూర్య'' అనుకుంటున్నాం. కాని అది కాదట. వక్కంతం వంశీ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను నాగబాబు మరియు లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పేరును ఎప్పుడో ప్రకటించి ఎప్పుడో లోగో లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ కింద ఉన్నది క్యాప్షన్ అని అందరూ అనుకుంటున్నారు. కాని అది కూడా టైటిలేనట. ''నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'' అనేది ఈ సినిమా టైటిల్ అంటూ నిన్న అల్లు అర్జున్ చెప్పేశాడు.

మొత్తానికి ఈ మధ్యకాలంలో అసలు ఇంత పొడవాటి టైటిల్ మనం చూసి ఉండం. గతంలో అయితే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి.. వంటి పొడవాటి టైటిల్స్ చాలానే వచ్చాయి కాని.. ఈ మధ్యకాలంలో రారండోయ్ వేడుక చూద్దాం ఒకటే అంత పొడుగు టైటిల్. ఇప్పుడు బన్నీ టైటిల్ కూడా ఆ లిస్టులోకే జాయిన్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమా తాలూకు ఫస్ట్ ఇంపాక్ట్ జనవరి 1న రిలీజ్ అవుతోంది.