Begin typing your search above and press return to search.

బన్నీ మళ్లీ క్లాస్ ఇచ్చాడు

By:  Tupaki Desk   |   26 Dec 2017 4:27 AM GMT
బన్నీ మళ్లీ క్లాస్ ఇచ్చాడు
X
అభిమాన హీరోని దగ్గరగా చూశాము అనే ఆనందం ఎవరూ వర్ణించలేనిది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అని అభిమానిని అడిగితే మాటల్లో చెప్పడం కష్టమే. ఆడియో వేడుకలు సక్సెస్ మీట్ లు ఉంటె అభిమానులు వచ్చి గోల చేస్తేనే ఆ వేడుకలకు అసలైన కళ ఉంటుంది. అయితే అభిమానుల గోలకు ఒక్కోసారి తారలకు చాలా కోపం వస్తుంది. అర్ధం చేసుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక ఒక్కోసారి కోపం తెచ్చుకునే హీరోలు కూడా ఉంటారు. ఇక ఆ తర్వాత సారి అని చెప్పడం మాములే.

ఇక అసలు విషయానికి వస్తే.. ఓ వర్గం ప్రేక్షకులు మర్చిపోని విధంగా చెప్పను బ్రదర్ అనే డైలాగ్ తో ఫేమస్ అయిన అల్లు అర్జున్ ఈ సారి మళ్లీ అదే తరహాలో తన అభిమానులకే కౌంటర్ వేయడం అందరికి షాక్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ ఆర్మీ అని ఫ్యాన్స్ కమిటీలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా అల్లు శిరీష్ ఒక్క క్షణం ప్రీ రిలీజ్ వేడుకకి అల్లు అర్జున్ ఆర్మీ ఫ్యాన్స్ చాలా మందే వచ్చారు. అయితే బన్నీ సినిమా గురించి మాట్లాడుతుండగా ఎప్పటిలానే అభిమానులు కేకలు వేయడం మొదలుపెట్టారు. దీంతో బన్నీ" ఎవరైనా మాట్లాడేటప్పుడు పూర్తిగా చెప్పేది వినండి" అంటూ పెద్ద క్లాస్ ఇచ్చాడు. ఆ మాట విన్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి సైలెంట్ అయిపోయారు.

''సంస్కారం అనేది చాలా ముఖ్యం. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వారిని మాట్లాడనివ్వాలి. అదే రెస్సెక్ట్ ఆఫ్ కాన్వర్జేషన్. ఆ సంస్కారం ఇవ్వకపోతే ఇంకెందుకు? అభిమానులను పిలిచేది గోల చేసి వీలలు వేస్తారనే. కాని ఎదుటివారు మట్లాడుతున్నప్పుడు వారిని ఇబ్బందిపెట్టేదిగా ఆ గోల ఉండకూడదు. మీరు అనవసరంగా ఇలా అల్లరి చేస్తే నేను అసహనానికి గురవుతాను'' అంటూ సెలవిచ్చాడు. దానితో అభిమానులు ఖంగుతిన్నారు.

ఇక వెళ్లేటప్పుడు కొంచెం కోప్పడ్డాను ఏమనుకోకండి అంటూ బదులిచ్చాడు. అభిమానులకు అభిమానాన్ని చాటుకోవడం తప్ప మరేమి తెలియదు అని చాలా మంది హీరోలు కోపం వచ్చినా సరే కొంచెం స్వీట్ గా నచ్చ చెబుతుంటారు. కానీ బన్నీ మాత్రం క్లాస్ లో టీచర్ లాగా పాఠాలు చెప్పేసరికి కొంచెం నెగిటివ్ అయ్యే అవకాశం ఉందేమో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.