Begin typing your search above and press return to search.
హ్యాపీ బర్త్ డే క్యూటీ : అల్లు అర్జున్
By: Tupaki Desk | 29 Sep 2018 5:05 PM GMT మెగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం అందరు చూస్తూనే ఉన్నారు. నా పేరు సూర్య చిత్రం తర్వాత ఇప్పటి వరకు తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టని అల్లు అర్జున్ ప్రస్తుతం ఫ్యామిలీతో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు తన పిల్లల ఫొటోలను మరియు భార్య స్నేహారెడ్డి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే అల్లు అర్జున్ తాజాగా తన భార్య పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు.
నేడు అల్లు స్నేహా రెడ్డి బర్త్ డే. ఈ సందర్బంగా ఆమెకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలుపుతూ... హ్యాపీ బర్త్ డే క్యూటీ - ప్రేమతో నా రాణి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో పాటు తన భార్యతో కలిసి ఉన్న ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. బన్నీ పోస్ట్ కు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది.

బన్నీ పోస్ట్ కు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున హ్యాపీ బర్త్ డే స్నేహా గారు అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అల్లు అర్జున్ తర్వాత సినిమాపై రెండు మూడు వారాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈయన సినిమా ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.