Begin typing your search above and press return to search.
నిజంగానే ఎక్కడా 'తగ్గేదే లే' అనిపించాడు!
By: Tupaki Desk | 18 Dec 2021 1:59 AM GMTఅల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' సినిమాను తొలి రోజునే తొలి ఆట చూడటానికి అభిమానులు చూపంచిన ఆసక్తి అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్ దగ్గర చూసినా ఈ సినిమాకి సంబంధించిన సందడినే కనిపించింది. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఈ సినిమాకి టికెట్లు దొరకడమే కష్టమైపోయింది.
దీనిని బట్టి ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఎంత ఆసక్తితో .. ఆత్రుతతో ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చును. ఇక సినిమాకి వెళ్లి థియేటర్ బయటికి వచ్చిన వాళ్లంతా చెప్పేది ఒకటే మాట .. ఇది బన్నీ వన్ మేన్ షో అని.
ఉండటానికి ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు .. ఎవరి పాత్రలో వాళ్లు తమ పరిథిలో చేశారు. కానీ ఫస్టు మార్కు పట్టుకుని ఎవరికి ఇవ్వాలా అని చూస్తే, కచ్చితంగా బన్నీకి ఇవ్వాలనిపిస్తుంది. అంతగా ఆయన ఈ పాత్రను ఓన్ చేసుకున్నాడు .. ఒదిగిపోయాడు.
ఎలాంటి ప్రేమానురాగాలకి నోచుకోకుండా పెరిగిన ఒక వ్యక్తి ఎలా మారతాడు? అడవిలో మృగాల్లాంటి మనుషుల మధ్య ఎలాంటి తెగువ చూపిస్తాడు? శ్రీవల్లి రూపంలో తనకి దొరికిన కొద్ది పాటి ప్రేమలోనే మరో ప్రపంచాన్ని ఎలా సృష్టించుకున్నాడు? ఇలా ప్రతి అంశాన్ని ఆయన జీర్ణించుకుని తెరపైన ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకుల నుంచి విజిల్స్ పడుతున్నాయి.
ఈ సినిమాలో .. ఫహాద్ ఫాజిల్ .. సునీల్ .. అనసూయ .. అజయ్ ఘోష్ .. ఇలా ప్రతిపాత్రను సుకుమార్ ప్రత్యేకంగా డిజైన్ చేసి వదిలాడు. కానీ నటనపరంగా బన్నీ అన్నీ తానై కనిపిస్తాడు. ఈ సినిమాకి సంబంధించిన కథాకథనాల్లో .. నటన పరమైన అంశాల్లో .. సాంకేతికపరమైన విషయాల్లో లోపాలు కనిపిస్తాయేమో గానీ, బన్నీ పరంగా ఎక్కడా ఎలాంటి లోపం కనిపించదు.
మొదటి నుంచి చివరి వరకూ ఏ సన్నివేశాన్ని తీసుకున్నా 'తగ్గేదే లే' అనిపించాడు. తన పాత్రతో కథ అంతటినీ ఆక్రమించాడు .. విజృంభించాడు. అందువలన ఇది ఆయన విశ్వరూపం అన్నట్టుగానే అనిపిస్తుంది.
పాత్ర పరంగా తనకి కల్పించిన లోపాన్ని గుర్తుపెట్టుకుంటూ ఆ పాత్రను తనకన్నా బాగా ఎవరూ చేయలేరనిపించాడు. చిత్తూరు జిల్లా యాసలో ఆయన డైలాగ్స్ వింటే, ఆ విషయంపై ఆయన ఎంత శ్రద్ధపెట్టాడో .. ఎంతటి కసరత్తు చేశాడో అర్థమవుతుంది. బన్నీ డాన్సులు ఇరగదీసేస్తాడు .. అలాండి డాన్సులు చేయకుండా పాత్రపరమైన లోపం అడ్డుపడుతూ రావడం ప్రేక్షకులకు నిరాశను కలిగిస్తుంది.
ఆ లోపం వలన కథకు ఒరిగేదిమిటనేది అర్థం కాదు. ఇక అనసూయ వంటి అందగత్తెను అలాంటి పాత్రలో .. ముఖ్యంగా అలాంటి హెయిర్ స్టైల్లో చూపించడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇక సమంత సాంగ్ విషయానికి వస్తే, సాహిత్యంలో ఉన్న పస .. స్టెప్పుల్లో లేదనే టాక్ ఉంది. మిగతా లోపాలను కవర్ చేస్తూ బన్నీ ఈ సినిమాను ఎంతవరకూ నెట్టుకెళతాడనేది చూడాలి మరి.