Begin typing your search above and press return to search.

సుకుమార్ 10 నిమిషాలే చెప్పాడట.. ఓకే చేసేశాడట

By:  Tupaki Desk   |   15 Dec 2021 4:33 AM GMT
సుకుమార్ 10 నిమిషాలే చెప్పాడట.. ఓకే చేసేశాడట
X
‘పుష్ప’.. తెలుగు ప్రజలు మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాల్లోని సినీ అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా చూస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియా మూవీగా మారిన పుష్ప మీద బజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది తప్పించి తగ్గట్లేదు.

తాజాగా విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ తో కాస్త తగ్గినట్లు కనిపించిన వేళ.. అనూహ్యంగా వచ్చిన సమంత సాంగ్.. ఈ సినిమా మీద విపరీతమైన ఆసక్తిని పెంచటమే కాదు.. ఈ పాటను తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళం.. కన్నడ.. హిందీలోనూ విని ఎంజాయ్ చేస్తున్న వారెందరో. నిజానికి ఈ పాట పుష్ప గురించి మళ్లీ అందరూ మాట్లాడుకునేలా చేయటమే కాదు.. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అన్న ఆసక్తిని మరింత పెంచింది.

మరో రెండు రోజుల్లో విడుదలయ్యే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ వర్కును సినిమా యూనిట్ పెంచేసింది. తాజాగా ఈ సినిమా విశేషాల్ని వెల్లడించారు చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్. ఆర్య.. ఆర్య2 తర్వాత తాను.. సుకుమార్ కలిసి ఒక సినిమా చేయాలని అనుకున్నామని.. ఒక రోజు సుకుమార్ వచ్చి పుష్ప మూవీ లైన్ ను పది నిమిషాలు చెప్పారని.. దానికే తాను సినిమా చేస్తానని చెప్పినట్లు చెప్పారు.

సినిమా చేయాలనుకున్నాం కానీ.. పాన్ ఇండియా మూవీగా మారుతుందని అనుకోలేదన్నారు. మంచి కథ అనుకొని.. సినిమా తీయాలనుకుంటే.. అది కాస్తా ఇలా అయ్యిందన్నారు. సినిమా పని మొదలై రెండేళ్లు అవుతుందని.. ఇందులో పి నెలలు కొవిడ్ వల్లనే ఆగిపోయిందన్నారు. లాక్ డౌన్ వేళలోనూ పుష్ప ఆలోచనలే మనసులో ఉండేవని.. తాను.. సుకుమార్ కలిసి పలుమార్లు వీడియో కాల్స్ లో మాట్లాడుకునే వాళ్లమన్నారు.

ఈ మూవీ కోసం యూనిట్ చాలా కష్టపడిందని.. చాలా రీసెర్చ్ చేశారన్నారు. ఈ సినిమాను తొలుత రెండు భాగాలుగా అనుకోలేదని.. చాలా పెద్ద కావటం.. నాలుగు గంటల నిడివి ఉండటంతో.. రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని భావించామన్నారు. ఈ ఏడాది ఎలాగైనా తొలి భాగాన్ని రిలీజ్ చేయాలనుకున్నామని.. కానీ పని పూర్తి కాకపోవటంతో సాధ్యం కాలేదన్నారు. మొత్తంగా సినిమా మీద తనకున్న అంచనాలు ఎంతన్న విషయాన్ని బన్నీ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.