Begin typing your search above and press return to search.

కేర‌ళ స్టూడెంట్ కోసం పుష్ప‌రాజ్..!

By:  Tupaki Desk   |   11 Nov 2022 11:30 AM GMT
కేర‌ళ స్టూడెంట్ కోసం పుష్ప‌రాజ్..!
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వ‌ర‌లో పాన్ ఇండియా వండ‌ర్ 'పుష్ప‌' ఫ్రాంఛైజీ 'పుష్ప 2' కోసం రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం త‌న స్నేహితుడి పెళ్లి కోసం ఫ్యామిలీతో క‌లిసి ద‌క్షిణాఫ్రికా వెళ్లిన బ‌న్నీ తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చాక 'పుష్ప 2' షూట్ లో పాల్గొన‌బోతున్నారు. ఇదిలా వుంటే అల్లు అర్జున్ చేసిన ఓ మంచి ప‌ని తాజాగా కేర‌ళ‌కు చెందిన ఓ క‌లెక్ట‌ర్ కార‌ణంగా బ‌య‌ట‌ప‌డింది. వివ‌రాల్లోకి వెళితే.. హీరో అల్లు అర్జున్ కు కేర‌ళ‌లోనూ అభిమానులు వున్న విష‌యం తెలిసిందే.

అక్క‌డి ప్రేక్ష‌కుల చేత మ‌ల్లు అర్జున్ అని ముద్దుగా పిలిపించుకుంటున్న బ‌న్నీ ఓ అభిమాని విష‌యంలో త‌మ గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. కేర‌ళ‌లోని అలెప్పీకి చెందిన ఓ విద్యార్థినికి ఆర్ధికంగా భ‌రోసాని క‌ల్పిస్తూ బ‌న్నీ అండ‌గా నిలిచారు. తండ్రిని పోగొట్టుకుని ఆర్థికంగా స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న ఓ న‌ర్సింగ్ స్టూడెంట్ చ‌దువుకు అయ్యే ఖ‌ర్చుని అంతా తానే భ‌రించ‌డానికి అల్లు అర్జున్ ముంద‌కొచ్చారు. అయితే ఆ వివ‌రాలు ఇన్ని రోజులు సీక్రెట్ గానే వుంచారు.

రీసెంట్ గా అలెప్పి క‌లెక్ట‌ర్ కృష్ణ‌తేజ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ తో అల్లు అర్జున్ చేస్తున్న సాయం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విష‌యం తెలిసిన అభిమానులు, నెటిజ‌న్ లు హీరో అల్లు అర్జున్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 'మ‌నం చేసే ప‌నిలో మంచి క‌నిపించాలి త‌ప్ప మ‌నిషి క‌నిపించాల్సిన అవ‌స‌రం లేదు' అని ఓ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ల‌ను ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అలెప్పి క‌లెక్ట‌ర్ కృష్ణ‌తేజ న‌ర్సింగ్ స్టూడెంట్ కి బ‌న్నీ సాయం అందించ‌డంపై ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాన్ని రాసుకొచ్చారు.

'కొన్ని రోజుల క్రితం న‌న్ను ఓ న‌ర్సింగ్ విద్యార్ధిని క‌లిసింది. కోవిడ్ తో ఆమె తండ్రి గ‌తేడాదే మ‌ర‌ణించారు. ఇంట‌ర్ లో 92 శాతం మార్కులు సాధించినా పై చ‌దువుల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి ఆమెది. ఆ స్టూడెంట్ కు భ‌విష్య‌త్తుపై వున్న ఆశ‌, ఆత్మ విశ్వాసం ఆమె క‌ళ్ల‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించాయి.

న‌ర్సింగ్ చేయాల‌నేది ఆమె క‌ల‌. 'వి ఆర్ ఫర్ అలెప్పి' ప్రాజెక్ట్ లో భాగంగా ఆమెకు సాహ‌యం చేయాల‌నుకున్నాం. అయితే మెరిట్ కోటాలో ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌మ‌యం ముగిసింది. మేనేజ్ మెంట్ కోటా కోసం ప్ర‌య‌త్నించ‌గా క‌ట్ట‌న‌మ్ లోని సెయింట్ థామ‌స్ న‌ర్సింగ్ కాలేజీలో సీటు ల‌భించింది.

అయితే అందుకు ఓ స్పాన్స‌ర్ అవ‌స‌రం. ఫేవ‌రేట్ స్టార్ అల్లు అర్జున్ కు ఈ విష‌యం చెప్పా..ఆయ‌న వెంట‌నే స్పందించారు. విద్యార్థిని హాస్ట‌ల్ ఫీజుతో స‌హా అన్ని ఖ‌ర్చులు ఆయ‌నే భ‌రిస్తానన్నారు. స్టూడెంట్ జాయిన్ అయిన మ‌రుస‌టి రోజు నేను కాలేజీకి వెళ్లా.. త‌ను బాగా చ‌దివి స‌మాజానికి మేలు చేస్తుంద‌నే న‌మ్మ‌క‌ముంది' అని తెలిపారు. దీంతో అల్లు అర్జున్ చేసిన సాహం ఇలా బ‌య‌ట‌ప‌డింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.