Begin typing your search above and press return to search.
బన్నీ.. పవన్ ఫ్యాన్స్ ని బాధపెట్టాడా?
By: Tupaki Desk | 28 Aug 2015 1:34 PM GMTస్టార్ హీరోల ఫ్యాన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ల మనోభావాల్ని దెబ్బ తీస్తే తట్టుకోలేరు. తమ హీరో విషయంలో ఏ చిన్న తేడా జరిగిన వాళ్లూరుకోరు. ఎవరైనా తమ హీరోను తక్కువ చేసే ప్రయత్నం చేస్తే వాళ్లకు ఎక్కడో మండిపోతుంది. తమ హీరోకు ఆప్తుడైనా సరే.. బంధువైనా సరే.. ఆ వ్యక్తి మీద కోపం తెచ్చేసుకుంటారు. ఇప్పుడు బన్నీ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలాగే రియాక్టవుతున్నారు.
పవన్ కళ్యాణ్ అంటే బన్నీకి అభిమానమే అన్న సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే పవన్ మీద ఉన్నది అభిమానమైతే.. చిరంజీవి మీద ఉన్నది భక్తి. అందుకే సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్ లో దాసరి.. పవన్ ముందు చిరును తక్కువ చేస్తే తట్టుకోలేకపోయాడు. ఆ సమయంలో పవన్ కన్నా చిరు గ్రేట్ అని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అది పవన్ అభిమానుల్ని కొంచెం నొచ్చుకునేలా చేసింది. అయినా పెద్దగా రియాక్టవలేదు.
ఐతే తాజాగా చిరు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా పవన్ అభిమానుల్ని నాగబాబు తీవ్ర స్వరంతో మందలించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రామ్ చరణ్ తో పాటు మిగతా మెగా హీరోలంతా కామ్ గా ఉండిపోయారు. కానీ అల్లు అర్జున్ మాత్రం చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేయడం మీద ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ విషయంపై వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. చరణ్ లా సైలెంటుగా ఉండకుండా ఇలా కేరింతలు కొట్టాల్సిన అవసరమేముందని ప్రశ్నిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. గతంలో చాలాసార్లు పవన్ ను ఆకాశానికెత్తేసిన బన్నీ.. ఇప్పుడిలా చేయడం ఎంతవరకు సబబని అడుగుతున్నారు. ఐతే బన్నీ తీరును మరోలా అర్థం చేసుకోవాల్సిన పని లేదని.. అనవసరంగా రాద్దాంతం చేసేవాళ్లను నాగబాబు మందలించడంపై హర్షం ప్రకటిస్తూ అలా చేశాడని బన్నీని వెనకేసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అతడి మద్దతుదారులు.