Begin typing your search above and press return to search.

ప్రియ తరహాలో తుపాకీ పేల్చిన బన్నీ

By:  Tupaki Desk   |   24 Feb 2018 11:24 AM GMT
ప్రియ తరహాలో తుపాకీ పేల్చిన బన్నీ
X
అల్లు అర్జున్ ఆల్రెడీ ఒక వారియర్ గా నటించేస్తున్నాడు. నా పేరు సూర్య మూవీలో సైనిక యోధుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మరో వారియర్.. అదేనండీ కన్నుకొట్టి అందరినీ పడేసిన ప్రియా వారియర్ గా మారిపోయాడు. కన్ను కొట్టడమే కాకుండా.. ప్రియా వారియర్ చూపించిన మరో ట్రిక్ అందరినీ ఆకట్టుకుంది.

వేళ్లకు ముద్దు పెట్టి.. గన్ ట్రిగ్గర్ మాదిరిగా చేతితో లాగి.. ముద్దుగా తుపాకీ పేల్చేసింది ప్రియా ప్రకాష్ వారియర్. ఇప్పుడు అదే తరహా ఫీట్ ను తను కూడా చేసి చూపించాడు బన్నీ. తన కొడుకు అల్లు అయాన్ తో ఆటలో భాగంగా.. ప్రియ తరహాలోనే ట్రై చేశాడు. అయాన్ కూడా తండ్రి మాదిరిగానే ప్రయత్నించగా.. చివరకు అల్లు అర్జున్ తన కొడుకును లవ్లీగా కాల్చేయడం.. మంచం అంచు పై నుంచి అయాన్ దూకేయడం అంతా ఓ వీడియో మాదిరిగా చిత్రీకరించి.. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది బన్నీ సతీమణి స్నేహారెడ్డి. ఈ వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో తెగ హల్ చల్ చేసేస్తోంది.

తను ఓ పెద్ద స్టార్ అయినా సరే.. ఏ మాత్రం భేషజాలు లేకుండా.. ఓ కొత్త అమ్మాయి ఫీట్ ను ఇమిటేట్ చేసిన తీరు సూపర్ అనాల్సిందే. ఇప్పటికే ఈ టీజర్ ను ట్వీట్ చేసి.. తెగ మెచ్చేసుకున్న బన్నీ.. ఇఫ్పుడు ఏకంగా ప్రియా వారియర్ ను ఇమిటేట్ చేస్తూ వీడియో తీయడం విశేషం. అటు ప్రియకు ఈ వీడియో కారణంగా ఫుల్ ప్రచారం దక్కుతుండగా.. అల్లు అర్జున్- అయాన్ ల సందడి మరీ మెప్పించేస్తోంది.