Begin typing your search above and press return to search.
బన్నీ బాబూ.. అతని పరిస్థితేంటో
By: Tupaki Desk | 25 Jun 2016 10:30 PM GMTఇప్పుడున్న సిట్యుయేషన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయడమంటే.. ఏ డైరెక్టర్ కయినా లక్కీ ఛాన్స్ అన్న మాటే. సూపర్.. ఇరగదీసేశాడు వరకూ అక్కర్లేదు.. చూడచ్చు అంటే చాలు బ్లాక్ బస్టర్ అయిపోతోంది సినిమా. దీంతో బన్నీతో సినిమాకి దర్శకులు క్యూ కడుతున్నారు.
సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత.. బన్నీ చేసే సినిమాపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి వినిపించిన విక్రమ్ కె కుమార్ - లింగుస్వామిలను కాదని.. హరీష్ శంకర్ వైపే బన్నీ మొగ్గు చూపాడు. ఈ మేరకు దిల్ రాజు నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. విక్రమ్ కె. కుమార్ ఇంకా బన్నీకి తగ్గ స్క్రిప్ట్ రెడీ కాలేదని చెప్పాడు. పైగా నితిన్ తో ముందుగా సినిమాకి మొగ్గాడు. ఇపుడు బన్నీ హరీష్ శంకర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మరి లింగుస్వామి పరిస్థితేంటి.. ఇక్కడ విషయం ఏంటంటే.. లింగుస్వామి సబ్జెక్ట్ కూడా బన్నీకి నచ్చింది కానీ.. ఇంకా ఫైనల్ వెర్షన్ తీసుకురాలేదట.
లింగుస్వామితో సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ ని అల్లు అర్జున్ చూపిస్తూనే ఉన్నాడు. తమిళ్ లో మార్కెట్ పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని మనోడి ఐడియా. ఒకవేళ లింగుస్వామి తెచ్చే ఫైనల్ వెర్షన్ కూడా నచ్చితే.. రెండు సినిమాలను ఒకేసారి షూటింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయట. ఎందుకంటే లింగుస్వామి సబ్జెక్ట్ ఎక్కువ టైం షూటింగ్ తీసుకోవడమే ఇందుకు కారణం అంటున్నారు. వాటే ప్లాన్ బన్నీ జీ!