Begin typing your search above and press return to search.

పాపను పరిచయం చేసిన బన్నీ

By:  Tupaki Desk   |   31 July 2017 5:20 PM GMT
పాపను పరిచయం చేసిన బన్నీ
X
ఇప్పుడు స్టార్ సెలబ్రీటలందరూ ఒకటే పని చేస్తున్నారు. తమ పిల్లలను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేస్తూ తెగ సంబరపడుతున్నారు. ఏదో ఒక అకేషన్ వచ్చినప్పుడు పిల్లల గురించి ప్రస్తావని తెస్తూ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. మొన్ననే మహేష్‌ బాబు తన కూతురు సితార కు బర్తడే విషెస్ చెప్పాడు. కరీనా కపూర్ తన కొడుకు తైమూర్ ఫోటోలు రిలీజ్ చేసింది. అలాగే ఇతర సెలబ్స్ కూడా అవే పనులు చేస్తున్నారులే.

ఇక తన కొడుకు ఫోటోలను కూతురు ఫోటోలను ఎప్పటినుండో షేర్ చేస్తున్న అల్లు అర్జున్ కూడా ఇప్పుడు మరోసారి అల్లు అర్హా ఫోటో షేర్ చేశాడు. తన కూతురు అంటూ తన లిటిల్ ఏంజెల్ అంటూ ఇప్పుడు అర్హా కొత్త ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు బన్నీ. ఈసారి తన కూతురుని గాల్లో ఎగరేస్తూ ఆడుకుంటున్న బన్నీ చాలా ఉత్సాహంగా కనిపించాడులే. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఇటువంటి క్రియేటివ్ మరియు క్యూట్ మూమెంట్స్ ను ఫోటోల్లో బంధిస్తోంది అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి మొదలుపెట్టిన పీక్-ఎ-బూ అనే ఫోటోగ్రాఫీ స్టూడియో తెలుసా!!

సినిమాల విషయానికొస్తే ఆగస్టు 2వ వారంలో అల్లు అర్జున్ తన కొత్త సినిమా ''నా పేరు సూర్య''ను మొదలుపెట్టనున్నాడు. ఇప్పుడు ఆ సినిమా కోసం జిమ్ లో కసరత్తులు చేస్తూ కొత్త లుక్ ను ప్రయత్నిస్తున్నాడట. అది సంగతి.