Begin typing your search above and press return to search.

రానా ల‌వ్ గురూ.. బ‌న్నీయే

By:  Tupaki Desk   |   7 Oct 2015 7:57 AM GMT
రానా ల‌వ్ గురూ.. బ‌న్నీయే
X
యంగ్ హీరోలు బ‌న్ని - రానా చిన్నప్ప‌ట్నుంచి క్లోజ్ ఫ్రెండ్స్‌. చెన్న‌య్ వీధుల్లో్ క‌లిసే తిరిగేవాళ్ల‌మ‌ని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. అయితే ఈ ఇద్ద‌రిమ‌ధ్యా బోలెడ‌న్న ఇంట్రెస్టింగ్ టాస్క్్స బైటి ప్ర‌పంచానికి తెలియ‌నివి కూడా ఉన్నాయి. ఈ ఇద్ద‌రూ ఎక్క‌డ ఎదురు ప‌డినా ల‌వ్ లైఫ్ గురించి కూడా ముచ్చ‌టించుకుంటారు. జోకుల‌తో చిలౌట్ చేస్తుంటారు.

ఇటీవ‌లే రుద్ర‌మ‌దేవి ప్ర‌మోష‌న్ ఈ వెంట్‌లో ఓ ఇంట్రెస్టింగ్ టాస్క్ గురించి క‌దిపారు ఇద్ద‌రూ . రానా అస‌లే రుద్ర‌మ‌దేవితో రొమాన్స్ చేసే చాళుక్య వీర‌భ‌ద్రుడిగా న‌టించాడు. మరి అందులో రొమాన్స్ పండించాలంటే ఎలా ? అనుభ‌వం లేదు క‌దా? అని ప్ర‌శ్నిస్తే ఏమ‌న్నాడో తెలుసా? బ‌న్ని చిన్న‌ప్ప‌ట్నుంచి పెళ్ల‌య్యే వ‌ర‌కూ డైరీలో త‌న ల‌వ్ లైఫ్ గురించి రాశాడు. అది నాకు ఇచ్చాడు. దాన్నుంచి బోలెడంత నేర్చుకున్నా. అందులోంచి ప్రిపేర్ అయ్యి రుద్ర‌మ‌దేవితో ల‌వ్ సీన్లు - రొమాన్స్ సీన్లు చేశాన‌ని రానా చెప్పాడు. అయితే దీనికి ప‌క్క‌నే ఉన్న బ‌న్ని ఏమ‌ని రిప్ల‌య్ ఇచ్చి ఉంటాడు? రానా నా డైరీ చ‌దివాడు కానీ ఇప్ప‌టికీ పెళ్లి చేసుకోలేదు .. అంటూ పంచ్ వేశాడు.

నిజ‌మే మ‌రి ఆఫ్ ది స్ర్కీన్ రొమాన్స్ చేయ‌డంలో ఉన్న దూకుడు పెళ్లి చేసుకోవ‌డంలో చూపించ‌డం లేదు ఈ యంగ్ గ‌య్‌. ప్రస్తుతం రుద్రమదేవి సినిమా రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తూ.. త్వరలోనే బెంగుళూరు డేస్‌ తమిళ రీమేక్‌ తో వచ్చేస్తున్నాడు రానా. ఇకపోతే బోయపాటి సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్‌. ఇద్దరూ రుద్రమ కోసం ఇలా మ్యాగ్జిమం ప్రమోషన్‌ చేస్తున్నారు.