Begin typing your search above and press return to search.
బుల్లోడి బుగ్గకి బన్నీ ముద్దు!
By: Tupaki Desk | 29 May 2017 4:27 PM GMTసినిమాలతో పాటు సమానంగా.. ఇంకా చెప్పాలంటే కాసింత ఎక్కువగానే కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే స్టార్ హీరోల లిస్ట్ లో మహేష్ బాబు పేరు మొదటగా వినిపిస్తుంది. అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు. అవసరమైతే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చేసి మరీ ఫ్యామిలీ టూర్స్ వేసేస్తుంటాడు. అందుకు తగ్గట్లుగా షూటింగ్ షెడ్యూల్స్ ను ప్లాన్ మార్చుకుంటూ ఉంటాడు.
ఇక తన కొడుకు అల్లు అయాన్ తో బన్నీ ఎంత క్లోజ్ అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పడం చాలా కష్టం. ఈ బుడతడు ఇంకా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి సూపర్బ్ పిక్స్ ద్వారా తన కొడుకుపై ఉన్న ప్రేమను చూపుతూనే ఉన్నాడు బన్నీ. ఎంతైనా స్టైలిష్ స్టార్ కొడుకు కదా.. అందుకే నాన్న స్టైల్ ను పట్టేసి సూపర్బ్ రెడీ అయిపోయిన అయాన్ కు.. బుగ్గన ముద్దు పెడుతూ బన్నీ ఇలా ఓ ఫోటో దిగేశాడు. ఇంతకీ అల్లు అర్జున్- అయాన్ ల ఫోటోను జనాలకు చూపించింది ఎవరో తెలుసా.. బన్నీ భార్య స్నేహ.
'మై బాయ్స్' అంటూ ఈ అల్లు బాయ్స్ ఫోటోను నెట్ లో షేర్ చేసింది స్నేహ. ఫ్యామిలీతో ఇలా అమూల్యమైన క్షణాలను గడుపుతూనే మరోవైపు.. అభిమానుల కోసం దువ్వాడ జగన్నాధం సిద్ధం చేసేస్తున్నాడు అల్లు అర్జున్. ఇంకా కొంత పార్ట్ షూటింగ్ చేయాల్సి ఉన్నా.. జూన్ 23న డీజే రిలీజ్ ఖాయమంటూ ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ కు సమాచారం వచ్చేసింది. అది పూర్తి చేయగానే స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న తొలి చిత్రాన్ని ప్రారంభిచేయనున్నాడు బన్నీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/