Begin typing your search above and press return to search.
బన్నీ... బాగా లేటయ్యిందే!!
By: Tupaki Desk | 30 April 2018 7:34 AM GMTటాలీవుడ్ లో ఇప్పుడు అందరి చూపు బన్నీపైనే ఉంది. వరుసగా ‘రంగస్థలం’- ‘భరత్ అను నేను’ వంటి రెండు బడా బ్లాక్ బస్టర్లు టాలీవుడ్ ను పలకరించడంతో బన్నీ ‘నా పేరు సూర్య’ రిజల్ట్ ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా నిన్న సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్‌గా జరిగింది.
అంతా బానే ఉంది కానీ ఈవెంట్ సమయం 6 గంటలకని ప్రకటనలు ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నాడంటూ తెగ ప్రమోషన్ కూడా చేసేశారు. దాంతో మెగా అభిమానులతో పాటు బన్నీ అభిమానులూ చాలామందే సాయంత్రం 5 గంటలకే స్టేడియానికి చేరుకున్నారు. కానీ హీరో గారు మాత్రం తాపీగా రాత్రి 8: 30కి గానీ స్టేడియానికి చేరుకోలేదు. హీరో కోసం అభిమానులు మూడున్నర గంటల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. బన్నీ ఒక్కడే ఇలా చేశాడని చెప్పలేం... పవన్ కల్యాణ్ దగ్గర్నుంచి మహేష్ బాబు- ఎన్.టీ.ఆర్- రామ్ చరణ్... ఆఖరికి నేచురల్ స్టార్ నాని దాకా అందరికీ లేటు రావడమనేది హాబీయే. అయితే బన్నీ మాత్రం బాగా లేటయ్యాడు. అందులోనూ ఈసారి అల్లువారబ్బాయి చేసింది ఓ మిలిటరీ ఆఫీసర్ పాత్ర. అందులోనూ క్రమశిక్షణ కోసం పరితపిస్తూ వీరావేశంతో ఊగిపోయే జవాను పాత్ర. అలాంటి సినిమా ఈవెంట్ విషయంలో కూడా ఇంత లేట్ చేస్తే ఎలా... అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వీర లెవెల్లో క్రేన్ మీద నిల్చొని జాతీయ పతాకం బ్రాక్ గ్రౌండ్లో పెట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు... ఈవెంట్ చివర్లో అందరి చేతా జనగణమణ పాడించి మంచి మార్కులే కొట్టేశాడు అల్లుఅర్జున్. అయితే కొంచెం టైమ్ సెన్స్ ఫాలో అయ్యి ఉంటే ఇంకా బాగుండేది అనుకుంటున్నారు సినీ జనాలు.