Begin typing your search above and press return to search.
బన్నీ గారూ.. అంత ఇదైపోకండి
By: Tupaki Desk | 18 Dec 2018 11:02 AM GMTఒకప్పుడు అల్లు అర్జున్ ఏదైనా సినిమా వేడుక లో వేదిక ఎక్కితే నాలుగు మాటలు మాట్లాడ్డానికి చాలా ఇబ్బంది పడిపోయేవాడు. మైకు అందుకుంటే షేకైపోయేవాడు. కానీ మధ్య అతడి లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇలాంటి వేడుకల కు బాగా ప్రిపేరై వస్తున్నాడు. చాలా విషయాలు అనర్గళం గా మాట్లాడేస్తున్నాడు. ఈ మధ్య మరీ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి జనాల కు క్లాస్ పీకడం కూడా ఎక్కువైపోయింది. ఈ క్రమంలోనే నిన్న ‘పడి పడి లేచె మనసు’ ఆడియో వేడుక లో మాట్లాడుతూ.. సినిమా వాళ్లను, రాజకీయ నాయకులనూ ఏకవచనంతో.. అరేయ్ ఒరేయ్ అని సంబోధించే వాళ్లను తగులుకున్నాడు.
చిరంజీవి నైనా.. చంద్రబాబు నాయుడి నైనా ‘గారు’ అనే సంబోధించాలని సెలవిచ్చాడు బన్నీ. ఐతే ఆ స్థాయి వ్యక్తుల గురించి పబ్లిగ్గా మాట్లాడేటపుడు కచ్చితంగా ‘గారు’ అని సంబోధించాల్సిందే.
ఐతే జనాలు క్యాజువల్ గా మాట్లాడుకునేటపుడు ‘గారు’ అనాలని కండిషన్ పెడితే వింటారా? ఈ విషయంలో ఎవరినీ నియంత్రించలేం. నిందించలేం. సామాజిక మాధ్యమాల్లో అంటే.. అక్కడ రకరకాల వ్యక్తులుంటారు. కొందరు కేవలం ట్రోలింగ్ కోసం.. ఎంటర్టైన్మెంట్ కోసమే ఇక్కడ పడి ఉంటారు. ఎవరో ఒకరిని తగులుకుని తిట్టడమే వారి పని. అలాంటోళ్ల గురించి అస్సలు ఆలోచించే పరిస్థితి లేదు.
ఇక జనాల క్యాజువల్ సంభాషణల్లో హీరోల్ని.. రాజకీయ నేతల్ని ఏకవచనం తో సంబోధించడం.. పేరు వెనుక ‘గాడు’ జోడించడం కూడా కామన్. ఒక సందర్భం లో కమెడియన్ ఎమ్మెస్ నారాయణ దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే.. జనాలు తనను వాళ్ల సంభాషణల్లో ‘ఎమ్మెస్ గాడు’ అంటుంటేనే సంతోషం అని చెప్పాడు. ఈ మాట అంటున్నారంటే తన ను ఓన్ చేసుకుంటున్నట్లే అన్నాడు. తమ కు నచ్చిన నటుడినో.. రాజకీయ నాయకుడి నో బాగా ఓన్ చేసుకోవడం ద్వారా కూడా వాళ్లు పేరు పెట్టి సంబోధిస్తారు.. అవసరమైతే ‘గాడు’ అని కూడా పిలుచుకుంటారు. ఓన్ చేసుకున్నా చేసుకోకపోయినా.. మామూలుగా మాట్లాడుకునేటపుడు ఏ స్థాయి వాళ్లకైనా ‘గారు’ జోడించడం జనాలకు అలవాటుండదు.
ఇలాంటి విషయాల్లో బన్నీ చెప్పాడనో.. ఇంకెవరో చెప్పారనో వాళ్లు మారిపోరు. అయినా గతం లో చాలా క్యాజువల్ గా.. సహజంగా కనిపించిన బన్నీ.. ఈ మధ్యే తానేదో మంచి పేరు తెచ్చేసుకోవాలన్న ఉబలాటం లో ప్రతిసారీ జనాలకు ఇలాంటి ఉపదేశాలిస్తూ కృత్రిమంగా తయారవుతున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు నాగబాబు లాంటి వాళ్లు మెగా అభిమానుల్ని రెచ్చగొడుతూ ప్రత్యర్థుల పైకి ఉసిగొల్పుతుంటే.. బన్నీ ఇక్కడ ఇలాంటి శాంతి వచనాలు పలికితే ఎలా ఉంటుంది?